టిటిడి కల్యాణ మండపాల పునరుద్ధరణ పనులు  పరిశీలన

Inspection of restoration work of TTD Kalyana Mandapam

Inspection of restoration work of TTD Kalyana Mandapam

– టిటిడి తిరుపతి జెఈవో  పి.బసంత్‌కుమార్‌

Date:20/08/2019

తిరుమల ముచ్చట్లు:

విజయవాడ, ఉయ్యూరులలోని టిటిడి కల్యాణ మండపాల పునరుద్ధరణ పనులను టిటిడి తిరుపతి జెఈవో   పి.బసంత్‌కుమార్‌, అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు.విజయవాడలోని టిటిడి కల్యాణ మండపంలో జరుగుతున్న ఆధునీకరణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కల్యాణ మండపంలో ఏర్పాటు చేస్తున్న సెంట్రల్‌ ఏ.సి. కల్యాణ వేదిక, పెండ్లి కూమారుడు, పెండ్లి కూమరై విడిది గదులు, భోజనశాల, వంటశాల, డ్రైనేజి, మరుగుదొడ్లు, తదితర అంశాలపై అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు.

 

 

అనంతరం క ష్ణాజిల్లా నిమ్మకూరులోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయాన్ని సందర్శించారు. ఆలయ పరిసరాలు, కల్యాణ మండపం నిర్మాణానికి ప్రతిపాదనలు పరిశీలించారు. అనంతరం అర్చకుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తర్వాత అర్చకుల క్వార్టర్స్‌ నిర్మాణం, ఆలయంలో మరమ్మత్తు పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

 

 

అదేవిధంగా ఉయ్యూరులోని టిటిడి కల్యాణ మండపం పునరుద్ధరణ పనులను త్వరత గితన పూర్తి చేయాలని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు.అనంతవరంలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.

 

 

 

 

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి సమీపంలోని వెంకటపాలెం గ్రామంలో నిర్మిస్తున్న శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దివ్యక్షేత్రం నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆలయ నిర్మాణ పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవోలు   ఆర్‌.రాజేంద్రుడు,  విశ్వనాథం, ఈఈ  ఎస్‌. ప్రసాద్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

బ్ర‌హ్మోత్స‌వాల్లోపు మ‌రుగుదొడ్ల మ‌ర‌మ్మ‌తులు పూర్తి చేయాలి :

Tags: Inspection of restoration work of TTD Kalyana Mandapam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *