వాహనాల తనిఖీ
తుగ్గలి ముచ్చట్లు:
తుగ్గలి సరిహద్దులోని పెరవలి రోడ్డు నందు శనివారం రోజున తుగ్గలి ఎస్.ఐ మల్లికార్జున వాహనాలను తనిఖీ చేశారు.అనంతరం వాహనదారుల లైసెన్స్,ఆర్సి వంటి సంబంధిత ఆధారాలను పరిశీలించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ను తప్పకుండా వినియోగించాలని ఆయన తెలియజేశారు. హెల్మెట్ మరియు లైసెన్స్ లేని వాహనదారులకు జరిమానా ను విధించారు.ఆటోల నందు పరిమితంగా ప్రయాణికులు ప్రయాణం చేయాలని ఆటో డ్రైవర్లకు ఎస్.ఐ తెలియజేశారు.లైసెన్సు లేకుండా వాహనాలను నడపకూడదని వాహనదారులకు ఎస్ఐ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో తుగ్గలి పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Tags: Inspection of vehicles

