Natyam ad

పుంగనూరులో బాలకార్మికులపై ప్రతి బుధవారం తనిఖీలు -కార్మికశాఖాధికారి మధుబాబు

పుంగనూరు ముచ్చట్లు:

ప్రభుత్వాదేశాల మేరకు ప్రతి బుధవారం బాలకార్మికులను పనిలో వినియోగించుకునే వారిపై తనిఖీలు నిర్వహించి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్థానిక కార్మికశాఖాధికారి మధుబాబు తెలిపారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సహాయ కమిషనర్‌ ఓంకార్‌రావు ఆదేశాల మేరకు పుంగనూరు, పలమనేరు పట్టణాల్లో బాలకార్మికులపై నిఘా పెట్టామన్నారు. వ్యాపారాలకు, మెకానిక్‌షాపులు, ఇటుకబట్టిలు, ఫ్యాక్టరీలు తదితర ప్రాంతాలలో చిన్నపిల్లలను పనుల్లోకి వినియోగిస్తే కేసులు నమోదు చేసి, యజమానికి రూ.20 వేలు జరిమాన, మూడు నెలల జైలుశిక్షను విధించడం జరుగుతుందన్నారు. బడిఈడు పిల్లలను పాఠశాలలకు తరలించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. బాలకార్మికులపై తగిన సమాచారం అందించాలని ప్రజలను కోరారు.

 

Post Midle

Tags: Inspections on child laborers in Punganur every Wednesday -Labour Department Officer Madhubabu

Post Midle