మందిరాల్లో సీసీ కెమెరాలు అమర్చుకోండి                    

Date:16/09/2020

మంత్రాలయం  ముచ్చట్లు:

భక్తులు రద్దీగా ఉండే ప్రార్థనా మందిరాల్లో సిసి కెమెరాలు తప్పకుండా  అమర్చుకోవాలని మాధవరం సచివాలయ మహిళా పోలీసులు పార్వతి,సునీతలు  ఆయా మత పెద్దలకు తెలియజేశారు. బుధవారం దేవాలయాలు మసీదులు చర్చిలకు వెళ్లి ప్రార్థనా మందిరాల లో సిసి కెమెరాలు తప్పకుండా అమర్చుకోవాలని దానికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను మత పెద్దలకు  అందజేశారు. దేవాలయాలు,మసీదులు , చర్చిలపై ప్రార్థనా మందిరాల పై దాడులు జరిగిన నేపథ్యంలో ప్రతి గ్రామంలోని ప్రతీ ప్రార్థనా మందిరాలలో సీసీ కెమెరాలు తప్పకుండా అమార్చుకోవాలని ప్రబుత్వ ఉత్తర్వులు అని వారు సూచించారు. ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన దేవాలయాలు మసీదులు చర్చిలు పై భౌతిక దాడులకు దిగిన వాటికి సంబందించిన ఆస్తులను ధ్వంసం చేసిన కఠిన చర్యలు తప్పవని ,అలాంటివారి  సమాచారం మాకు అందజేయాలని సచివాలయ ఉద్యోగులు మహిళా పోలీసులు మత పెద్దలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లో మహిళా పోలీసులు పార్వతి సునీత, సిబ్బంది పవన్ లు పాల్గొన్నారు .

లెండి వాగులో వరద నీరు

Tags: Install CCTV cameras in halls

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *