పుంగనూరులోని జగనన్న కాలనీలలో విద్యుత్‌లైన్లు ఏర్పాటు

పుంగనూరు ముచ్చట్లు:

మున్సిపాలిటి పరిధిలోని పేద లబ్ధిదారులు నిర్మిస్తున్న జగనన్న కాలనీలలో విద్యుత్‌లైన్ల ఏర్పాటు కార్యక్రమాన్ని బుధవారం కమిషనర్‌ నరసింహప్రసాద్‌, మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, ట్రాన్స్కోఏడి రవికుమార్‌ నిర్వహించారు. బైపాస్‌ రోడ్డు వద్ద నిర్మిస్తున్న జగనన్న కాలనీలలో నిర్మాణాలకు అడ్డంగా ఉన్న వైర్లను తొలగించారు. అలాగే నూతన లైన్లను , ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశారు. చైర్మన్‌ మాట్లాడుతూ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు విద్యుత్‌ సౌకర్యం ఏర్పాటు చేశామన్నారు. వీటితో పాటు రోడ్లు, కాలువలు, మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేస్తున్నామన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతాల్లో టౌన్‌షిప్‌లు ఏర్పాటౌతున్నాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ డీఈఈ మహేష్‌, ట్రాన్స్కో ఏఈ ధనుంజయమూర్తి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Installation of power lines in Jagananna colonies in Punganur

Leave A Reply

Your email address will not be published.