Natyam ad

అంబటి వైసీపీలో చేరే సూచనలు

విజయవాడ ముచ్చట్లు:


ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు అధికార వైసీపీలో చేరే సూచనలు నిండుగా కనిపిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితమే సీఎం వైయస్ జగన్ ప్రసంగాన్ని రీట్వీట్ చేసి చర్చనీయాంశంగా మారిన రాయుడు.. ఇప్పుడు తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నాడు. ఈ క్రమంలోనే నేరుగా ముఖ్యమంత్రి జగన్తో భేటి అయిన రాయుడు ఆయనతో ఏం మాట్లాడాడనేది ఇంకా తెలియరాలేదు.గుంటూరు జిల్లాకు చెందిన రాయుడు 2013-19 మధ్యకాలంటో భారత జట్టుకు ఆడాడు. ఆ తర్వాత జాతీయ క్రికెట్ నుంచి విరామం తీసుకుని ఐపీఎల్‌లో కొనసాగుతున్నాడు. ఈ క్రమంలోనే కొన్నిరోజుల కిందట సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టుకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జగన్ ప్రసంగించగా, ఆ స్పీచ్‌ను అంబటి రాయుడు రీట్వీట్ చేశారు. అంతేకాక ‘ఏపీలో ప్రతి ఒక్కరికీ మీపై విశ్వాసం ఉంది సార్’ అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చాడు. అంతలోనే నేడు సీఎం జగన్‌తో భేటీ అయ్యాడు. దీంతో రాయుడు రాజకీయాలలోకి రంగప్రవేశం చేస్తున్నాడేమోనని సర్వత్రా చర్చ సాగుతోంది.

 

 

గుంటూరులో పుట్టిన అంబటి  రాయుడు రాజకీయాల్లోకి రావాలని చాన్నాళ్ల నుంచి ఆలోచిస్తున్నారు.  ప్రజలకు సేవ చేసేందుకు ఇదే ఉత్తమ మార్గం అనుకుంటున్నానని  కొందరిని కలిసిన తర్వాత తుది నిర్ణయం చెబుతానంటున్నారు.   ఏ పార్టీలో చేరాలన్నది కూడా అప్పుడే తెలుస్తుంది’ అని రాయుడు చెప్పాడు. హైదరాబాద్‌‌‌‌లో క్రికెటర్‌‌‌‌ కెరీర్‌‌‌‌ స్టార్ట్‌‌‌‌ చేసినప్పటికీ  తెలంగాణలో కాకుండా ఏపీలోనే పొలిటికల్‌‌‌‌ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.  ఏపీలో బలమైన కాపు వర్గానికి చెందిన రాయుడు తన సొంత జిల్లా అయిన గుంటూరు నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. అయితే ఏ పార్టీ అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.  బీఆర్ఎస్ నుంచి అంబటిరాయుడు ఆఫర్ వెళ్లినట్లుగా చెబుతున్నారు.  బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఏపీ ప్రెసిడెంట్ తోట చంద్రశేఖర్‌‌‌‌.. బీఆర్ఎస్‌లో చేరి గుంటూరు పశ్చిమ నుంచి  పోటీ చేయాలని ఆహ్వానించినట్లుగా చెబుతున్నారు.

 

 

 

Post Midle

అయితే అంబటి ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు.  ఇప్పుడు సీఎం జగన్ ను కలిసినందున వైసీపీలో చేరుతారని భావిస్తున్నారు. వచ్చే ఐపీఎల్‌లో ఆడుతారో లేదో అన్నదానిపై స్పష్టత లేదు. ఇప్పటికే అంబటి రాయుడు వయుసు  37 ఏళ్లు. ఆయన ఇంకా ఎక్కువ కాలం క్రికెట్ కెరీర్ సాగించడం సాధ్యం కాదు. ఈ ఏడాది ఆయన ఐపీఎల్ ఇన్నింగ్స్ గొప్పగా సాగడం లేదు. వచ్చే సారి టీంలో ఉంచుతారో లేదో కూడాతెలియదు. అందుకే క్రికెట్ అకాడెమీ పెట్టాలనే ఆలోచనలో కూడా ఉన్నారని చెబుతున్నారు. దానికి భూమి అడిగేందుకు జగన్ ను కలిశారన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. అయితే సీఎం జగన్ తో భేటీపై .. అటు అంబటి రాయుడు కానీ ఇటు సీఎంవో కానీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ప్రకటన చేసిన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

 

Tags: Instructions for joining Ambati YCP

Post Midle