పుంగనూరులో 200 మంది డ్రైవర్లకు ఇన్సూరెన్స్ పథకం
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని సుమారు 200 మంది డ్రైవర్లకు ఇండియా పోస్టు ద్వారా భీమా సౌకర్యం కల్పించినట్లు పోస్టల్ ఇన్‌స్పెక్టర్ సతీష్ తెలిపారు. బుధవారం వైఎస్సార్‌సీపీ మైనార్టీ సెల్ నాయకుడు సిద్దిక్ తన సొంత నిధులతో డ్రైవర్లకు ఒకొక్కరికి రూ.395లు చొప్పున పోస్టల్‌శాఖకు చెల్లించారు. ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ సతీష్ డ్రైవర్లకు భీమా సౌకర్యం కల్పించారు. ఆయన మాట్లాడుతూ డ్రైవర్లు ఏవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షలు ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందన్నారు. అలాగే వికలాంగులకు రూ.2 లక్షలు చెల్లించడం జరుగుతుందన్నారు. వీటితో పాటు రవాణా సౌకర్యానికి రూ.25 వేలు, ఆనారోగ్యానికి గురై చికిత్స పొందే రోజులకు రూ.1000 లు చొప్పున చెల్లించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరారు. సిద్దిక్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అంజుమన్ కమిటి అధ్యక్షుడు ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.

Tags; Insurance scheme for 200 drivers in Punganur
