రైతులందరికీ బీమా : సీఎం కేసీఆర్

Insurance to all farmers: CM KCR

Insurance to all farmers: CM KCR

Date:13/07/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
రాష్ట్రంలోని రైతులందరికీ రైతు బంధు జీవిత బీమా వర్తింప చేసేందుకు వ్యవసాయ అధికారులు కృషి చేయాలని సీఎం ఆదేశించారు.  రైతులందరి పేర్లు నమోదయ్యే వరకు నామిని దరఖాస్తులు స్వీకరించే కార్యక్రమం కొనసాగించాలని, ఇప్పటి వరకు సేకరించిన వివరాలను వెంటనే ప్రభుత్వానికి సమర్పించాలన్నారు. పట్టాదారు పాస్ పుస్తకాల్లో దొర్లిన తప్పులను సవరించడం, పేరు మార్పిడీ తదితర కార్యక్రమాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. రైతు బీమా పథకం కోసం రైతులందరి పేర్లు నమోదు చేయాలి. రైతుకు ఎన్ని చోట్ల భూమి ఉన్నా, ఎన్ని ఖాతాలున్నా ఒక రైతుకు ఒక పాలసీ మాత్రమే వర్తిస్తుంది.  పేద, ధనిక అనే తేడా లేకుండా 18-60 సంవత్సరాల వయస్సున్నప్రతి రైతు పేరు నమోదు చేయాలని అయన అన్నారు. నామినీ దరఖాస్తు ఫారాలు తొందరగా ఇచ్చే విధంగా రైతులకు అవగాహన కల్పించాలి.  ఇప్పటి వరకు సేకరించిన వివరాలను వెంటనే ప్రభుత్వానికి అందచేస్తే, మొదటి విడత బీమా ప్రీమియం సొమ్ము చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అయన అన్నారు అనుకున్నంత వేగంగా పని జరగడం లేదు. వేగం పెంచాల్సిన అవసరం ఉంది. ముందు రికార్డులన్నింటినీ మాన్యువల్ గా సరి చేసుకోవాలి అని సీఎం సూచించారు.
రైతులందరికీ బీమా : సీఎం కేసీఆర్https://www.telugumuchatlu.com/insurance-to-all-farmers-cm-kcr/
Tags; Insurance to all farmers: CM KCR

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *