పర్యాటక అభివృద్ధి సంస్ధలో సమీకృత మానవ వనరుల విధానం

Date:12/11/2018
అమరావతి ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ది సంస్ధ సమర్ధ నిర్వహణలో భాగంగా సమీకృత మానవ వనరుల విధానాన్ని అమలులోకి తీసుకురావాలని సంస్ధ పాలక మండలి నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేక ఏజెన్సీని నియమించి పూర్తి స్దాయి నివేదికను కోరాలని, తదనుగుణ వాస్తవ పరిస్ధితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని భావించారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ది సంస్ధ పాలక మండలి 178వ సర్వసభ్య సమావేశం వెలగపూడి సచివాలయంలోని మూడవ బ్లాక్ సమావేశమందిరంలో సోమవారం జరిగింది.
పర్యాటక అభివృద్ది సంస్ధ ఛైర్మన్ అచార్య జయరామిరెడ్డి నేతృత్వంలో సాగిన ఈ సమావేశం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. సమావేశానికి హాజరైన పాలక మండలి సభ్యులు పలువురు సంస్ధ ఉద్యోగుల పరంగా రానున్న రోజుల్లో ఏర్పడే మానవవనరుల కొరత గురించి ప్రస్తావించారు. ప్రస్తుతం అతి తక్కువ మంది శాశ్వత ఉద్యోగులు పనిచేస్తుండగా, వారు పదవీ విరమణ చేస్తే సంస్ధ నడక ఏలా అన్న ప్రశ్నను లేవనెత్తారు. అవసరాలమేరకు నియామక ప్రక్రియ చేపటట్టంతో పాటు, కాంట్రాక్టు ఉద్యోగులలో ఉద్యోగ భద్రతకు సంబంధించిన భరోసా కల్పించాలన్నారు.
ఈ నేపధ్యంలో పర్యాటక, భాషా, సాంస్కృతిక శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ మానవవనరుల విధాన రూపకల్పన కోసం పూర్తిస్ధాయి అధ్యయనం చేస్తామని, ఇందుకు నిపుణత కలిగిన ఏజెన్సీని అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. పర్యాటక అభివృద్ధి సంస్ధ పరిధిలో మౌళిక సదుపాయాల కల్పనలో భాగంగా పలు నిర్మాణ పనులు సాగుతుండగా, టెండర్ల ఖరారు సంబంధించి పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది.
దీనివల్ల సంస్ధ కు అర్ధికంగా మేలు చేకూరే అవకాశం ఉంది.సంస్ధకు చెందిన కాంట్రాక్టు, శాశ్వత ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న మధ్యంతర భృతిని కూడా చెల్లించాలని పాలక మండలి తీర్మానించింది. ఇందుకోసం సుమారు 47.6 లక్షలు వ్యయం అవుతాయని సంస్ధ నిర్వహణ సంచాలకులు హిమాన్హు శుక్లా తెలిపారు. సంస్ధ అతిధి గృహాలను ఆధునీకరించే క్రమంలో భాగంగా ప్రస్తుత అర్ధిక సంవత్సరంలో శ్రీశైలం, కర్నూలు, కడప, దిండి, గండికోటలలో నిధులు వ్యయం చేయనున్నట్లు మీనా సమావేశం దృష్టికి తీసుకువచ్చారు.
హారిత హోటల్స్లో సేవా ప్రమాణాలను పెంపొందించే కార్యక్రమంలో భాగంగా సంస్ధ అంతర్గత విజెలెన్స్తో పాటు, మూడో పార్టీ నిఘాను కూడా ఉంచాలని పాలకమండలి నిర్ణయించింది. ఈ సమావేశంలో సంస్ధ డైరెక్టర్లు సింహాచలం నాయిడు, బాబూ రమేష్, రాము, బ్రహ్మయ్య, ఎపిటిడిసి ఇడి టివిఎస్జి కుమార్, జిఎం డాక్టర్ విశ్వనాధన్ పాల్గొన్నారు.
Tags;Integrated human resource system in the Tourism Development Agency

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *