ముమ్మ‌రంగా ఓట‌రు జాబితా ప్ర‌క్షాళ‌న‌ కార్య‌క్ర‌మం

Intensely voter listing clearing program

Intensely voter listing clearing program

Date:15/09/2018
మ‌ర‌ణించిన వారి ఓట‌ర్ల‌ను తొల‌గించాలి – దాన‌కిషోర్‌
హైదరాబాద్ ముచ్చట్లు :
హైద‌రాబాద్ జిల్లాలో గ‌త ఐదు సంవ‌త్స‌రాలుగా 1,22,700 మ‌ర‌ణాలు జ‌రిగిన‌ట్లు అధికారిక గ‌ణాంకాలు తెలుపుతున్నాయి. కాగా వీటిలో ఇంకా కొంతమంది ఓట్లు ఉన్నాయి. అదేవిధంగా, జ‌నాభాలో యువ ఓట‌ర్లు 3.75 శాతం ఉండాలి. కానీ ఇంత మొత్తంలో లేవు. వీట‌న్నింటినీ విస్తృత స్థాయిలో స‌ర్వే చేప‌ట్టిన‌ట్లు హైద‌రాబాద్ జిల్లా ఎన్నిక‌ల అధికారి, జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ దాన‌కిషోర్ వెల్ల‌డించారు.
నేడు జీహెచ్ఎంసీ కార్యాల‌యంలో హైద‌రాబాద్ క‌లెక్ట‌ర్ ర‌ఘునంద‌న్‌రావు, జీహెచ్ఎంసీ అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్లు అమ్ర‌పాలి, అద్వైత్‌కుమార్ సింగ్‌, సందీప్‌జా, కెన‌డి, రెవెన్యూ, ఐ.సి.డి.ఎస్ త‌దిత‌ర అధికారుల‌తో నేడు స‌మావేశం నిర్వ‌హించారు.
ఈ సంద‌ర్భంగా దాన‌కిషోర్ మాట్లాడుతూ జ‌న‌న, మ‌ర‌ణ రిజిస్ట్రార్‌ల నుండి అధికారికంగా మ‌ర‌ణించిన వారి రికార్డుల‌ను తెప్పించుకొని, వాటిని మ‌రోసారి ఇంటింటి స‌ర్వే ద్వారా విచారించి, ఒక‌వేళ జాబితాలో ఓటు ఉంటే త‌గు ఆధారాల‌తో తొల‌గించ‌నున్న‌ట్లు తెలిపారు.
హైద‌రాబాద్ జిల్లాలో యువ ఓట‌ర్ల న‌మోదు త‌గు నిష్ప‌త్తికి అనుగుణంగాలేదు. యువ ఓట‌ర్ల‌ను విస్తృతంగా న‌మోదు చేయించ‌డానికి ప్ర‌త్యేక ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టిన‌ట్లు తెలిపారు. యువ ఓట‌ర్లు ఓటు హ‌క్కు న‌మోదుకుగాను న‌గ‌రంలోని ప్ర‌ధాన క‌ళాశాల‌ల్లో ప్ర‌త్యేకంగా కౌంట‌ర్లు ఏర్పాటు చేశామ‌ని తెలిపారు.
ఓట‌రు జాబితా స‌వ‌ర‌ణ‌పై ప్ర‌త్యేక టోల్‌ఫ్రీ నెం: 1800-599-2999
హైద‌రాబాద్ జిల్లాలో నూత‌న ఓట‌ర్ల న‌మోదు, చిరునామా మార్పిడి, ఓట‌ర్ల తొల‌గింపు త‌దిత‌ర సందేహాల నివృత్తి కోసం జీహెచ్ఎంసీ ప్ర‌ధాన కార్యాల‌యంలో ప్ర‌త్యేకంగా టోల్ ఫ్రీ నెం: 1800-599-2999 అనే 15 లైన్ల‌తో ఏర్పాటు చేశామ‌ని జిల్లా ఎన్నిక‌ల అధికారి దాన‌కిషోర్ తెలిపారు. నేటి నుండి ఈ టోల్ ఫ్రీ నెంబ‌ర్ అందుబాటులోకి వ‌స్తుంద‌ని అన్నారు.
సీనియ‌ర్ సిటీజ‌న్ క్ల‌బ్‌ల స‌హ‌కారం
న‌గ‌రంలో యువ ఓట‌రు న‌మోదుకుగాను సిటీలో ఉన్న 600ల‌కు పైగా సీనియ‌ర్ సిటీజ‌న్ క్ల‌బ్‌ల స‌హాయ‌స‌హ‌కారాలు పొంద‌నున్న‌ట్లు జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ తెలిపారు. ఈ సీనియ‌ర్ సిటీజ‌న్ క్ల‌బ్‌ల స‌భ్యులు, వారి యువ కుటుంబ స‌భ్యుల‌తో ప్ర‌త్యేక చైత‌న్య ర్యాలీ నిర్వ‌హించ‌నున్న‌ట్లు క‌మిష‌న‌ర్ తెలిపారు.
ఈ నెల 15,16 తేదీల‌లో ప్ర‌తి వార్డు, బ‌స్తీల‌తో పాటు కాల‌నీ సంక్షేమ సంఘాల‌తో ప్ర‌త్యేక స‌మావేశాలు నిర్వ‌హించి ఓట‌రు చైత‌న్య కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.
దివ్యాంగ ఓట‌రు న‌మోదు, సౌక‌ర్యాల‌పై ప్ర‌త్యేక దృష్టి
న‌గ‌రంలో దివ్యాంగ ఓట‌ర్లంద‌రికీ న‌మోదు చేయ‌డానికి కూడా ప్ర‌త్యేక చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని క‌మిష‌న‌ర్ దాన‌కిషోర్ తెలిపారు. అర్హులైన వారంద‌కినీ ఓట‌రుగా న‌మోదు చేయ‌డంతో పాటు అన్ని పోలింగ్ బూత్‌ల‌లో వారు ఓటేసేందుకు ర్యాంపుల నిర్మాణం, ఇత‌ర సౌక‌ర్యాల‌ను కల్పించ‌నున్న‌ట్లు తెలిపారు. ఎన్నిక‌ల ప్ర‌క్రియ, ఓట‌రు న‌మోదుతో దివ్యాంగుల‌ను కూడా చురుకుగా భాగ‌స్వామ్యం చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.
వ‌స్తున్నాయి ఓట‌రు చైత‌న్య ర‌థాలు
ఓటర్ల న‌మోదు, స‌వ‌ర‌ణ‌తో పాటు ఓటింగ్‌లో పాల్గొని ప్ర‌జాస్వామ్య ప్ర‌క్రియ‌ను మ‌రింత బ‌లోపేతం చేసేందుకుగాను చేప‌ట్టిన విస్తృత ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో భాగంగా న‌గ‌రంలో ఓట‌రు చైత‌న్య ప్ర‌చార ర‌థాల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు దాన‌కిషోర్ వెల్లడించారు. న‌గ‌రంలో ఉన్న కాల‌నీ సంక్షేమ సంఘాల స్వ‌చ్చంద సంస్థ‌ల ద్వారా  ఓట‌రు చైత‌న్య ర‌థాల ద్వారా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు.
Tags:Intensely voter listing clearing program

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *