ఈ నెల 12 నుంచి ఇంటర్ కాలేజీలు

అమరావతి  ముచ్చట్లు:
రాష్ట్రంలో ఇంటర్ కళాశాలలు ఈ నెల 12 నుంచి ప్రారంభంకానున్నాయి.  ఆరోజున కళాశాలల ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు, ఇతర సిబ్బంది అంతా విధులకు హాజరుకావాలని విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది.  అదే రోజు నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఆన్లైన్ క్లాస్లు ప్రారంభించాలని నిర్దేశించింది.  సెకండియర్కు మొత్తం 213 రోజుల అకడమిక్ క్యాలెండర్ను విడుదల చేసింది.  దీనిప్రకారం ఈ నెల 12 నుంచి వచ్చే ఏడాది మార్చి 23 వరకు క్లాసులు జరుగుతాయి.  మధ్యలో అక్టోబరు 1 నుంచి 8వ తేదీ వరకు అర్ధ సంవత్సర పరీక్షలు, అలాగే యూనిట్ టెస్ట్లు కూడా నిర్వహిస్తారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags:Inter colleges from the 12th of this month

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *