అంతర్ జిల్లా  బైక్ ల దొంగలు అరెస్ట్

జల్సాల కోసం చోరీలు ..
నిర్జన  ప్రదేశాలలో పార్కింగ్ చేసిన మోటర్ సైకిల్లే టార్గెట్…
ముగ్గురు నిందితుల అరెస్ట్…..15 బైక్ ల స్వాధీనం…

రామగుండం ముచ్చట్లు:

ఎన్టిపిసి పోలీస్ స్టేషన్ ఆవరణలో పెద్దపల్లి డిసిపి రవీందర్, గోదావరిఖని ఎసిపి గిరి ప్రసాద్ ,అధికారులతో కలిసి పత్రిక సమావేశం ఏర్పాటు చేసి బైక్ ల దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుల అరెస్ట్ వివరాలు వెల్లడించారు.  గత నెల రోజుల నుండి ఎన్టీపీసీ  పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ సైకిల్ లు చోరికి గురి అవుతుండడం తో, ఉన్నత అధికారుల  ఆదేశాల   మేడిపల్లి చౌరస్తా లో, ఎన్టీపీసీ   పోలీసులు  వాహనాల తనిఖి నిర్వహిస్తుండగా ఇద్దరు యువకులు మోటార్ సైకిల్స్  పై వస్తూ పోలీస్ వారిని చూసి  అనుమానాస్పదంగా పారిపోతుండగా, పోలీసులు  చాకచక్యంగా వారిని పట్టుకున్నారు. వారు వాహనాలను దొంగిలించినట్లుగా నిర్దారించారు. వెంటనే వారిని అదుపులో కి తీసుకున్ఆరు. దొంగతనాలకు పాల్పడుతూ దొంగిలించిన వాహనాలను బయ్యపు దామోదర్ రెడ్డి  ద్వారా అమ్మి వచ్చిన డబ్బుల తో జల్సాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

 

Tags: Inter-district bike thieves arrested

Leave A Reply

Your email address will not be published.