ఇంటర్ పరీక్షలు ప్రారంభం
నల్గోండ ముచ్చట్లు
జిల్లా లో బుధవారం నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు అయ్యాయి. ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లాలో పరీక్షల నిర్వహణకు కట్టిదిట్టమైన ఏర్పాటు చేశారు అధికారులు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 47 పరీక్ష కేంద్రాల్లో 30,676 మంది మొదటి, రెండవ సంవత్సర విద్యార్థులు.. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు రాయనున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మొత్తం 111 పరీక్ష కేంద్రాల్లో.. 60 వేల 915 మంది విద్యార్థులు పరీక్ష రాయబోతున్నారు. ఒక్క నిమిషం నిబంధన అమల్లోకి ఉండడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ అరగంట ముందే పరీక్షా కేంద్రాన్ని చేరుకోవాలని అధికారులు ఇప్పటికే సూచించారు. వేసవికాలం ప్రారంభమైన దృష్ట్యా పరీక్ష రాసే విద్యార్థులకు తాగునీరు అనారోగ్యమైతే వైద్య సిబ్బంది ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు

Tags;
Inter exams start
