వైభవంగా ప్రారంభమైన అంతరాష్ట్ర కబడ్డీ పోటీలు

Inter-State Kabaddi Contests

Inter-State Kabaddi Contests

Date:22/09/2018

-మూడు రోజులు పోటీలు.

– ప్రారంభించిన మాజీ ఎంపి మిధున్‌రెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలోని బిఎంఎస్‌క్లబ్‌లో శనివారం రాత్రి 30వ అంతర్‌రాష్ట్ర అండర్‌-16 కబడ్డీ పోటీలు వైభవంగా ప్రారంభించారు. రాష్ట్ర కబడ్డీ సంఘ కార్యదర్శి వీరలంకయ్య , జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్షుడు రామచంద్ర, కమిషనర్‌ కెఎల్‌.వర్మ, సీఐ సాయినాథ్‌ ఆధ్వర్యంలో పోటీలు ఏర్పాటు చేశారు.

 

ఈ పోటీలకు అతిధిగా మాజీ ఎంపి పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి హాజరై , క్రీడాజ్యోతి వెలిగించారు. 13 జిల్లాలకు చెందిన క్రీడాకారులతో పరిచయ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ ఉద్యోగ కార్మికసంఘ అధ్యక్షుడు ఫకృద్ధిన్‌షరీఫ్‌ మాట్లాడుతూ జాతీయ కబడ్డీ క్రీడాకారుడు దివంగత మారిశెట్టి జ్ఞాపకార్థం ఈ పోటీలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.

 

క్రీడాకారులు స్నేహితబావంతో పోటీల్లో పాల్గొనాలన్నారు. పుంగనూరు క్రీడలకు పుట్టినిల్లు అన్నారు. రాష్ట్ర స్థాయి పోటీలు పుంగనూరులో నిర్వహించేందుకు పూర్తి సహాకారం అందించిన ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ ఎంపి పెద్దిరెడ్డి వెంకట మిధున్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సిపి రాష్ట్ర కార్యదర్శులు రెడ్డెప్ప, కొండవీటి నాగభూషణం, బైరెడ్డిపల్లె క్రిష్ణమూర్తి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అక్కిసాని భాస్కర్‌రెడ్డి, ఆర్టీసి మజ్ధూర్‌నాయకుడు జయరామిరెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షుడు ఇఫ్తికార్‌, ఎంపిపి నరసింహులు, జెడ్పిటిసి వెంకటరెడ్డి యాదవ్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ అమరేంద్ర, కౌన్సిలర్లు అమ్ము, మనోహర్‌, ఇబ్రహిం, రేష్మ, మంజుల, పెద్దిరెడ్డి యువజన సంఘ నాయకులు రాజేష్‌, చందారెడ్డెప్పరెడ్డి, సురేష్‌, కుమార్‌, హేము, బూత్‌ కమిటిల అధ్యక్షుడు రెడ్డెప్ప, పార్టీ నాయకులు త్రిమూర్తిరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి బిటి అతావుల్లా, మహబూబ్‌బాషా, ఖాదర్‌బాషా, శంకరప్ప తదితరులు పాల్గొన్నారు.

ఏర్పాట్లు….

అంతరాష్ట్ర అండర్‌-16 కబడ్డీ పోటీలు బిఎంఎస్‌క్లబ్‌ మైదానం ప్రారంభించారు. రాత్రి, పగలు మ్యాచ్‌లు ఉండటంతో ప్లడ్‌లైట్లు ఏర్పాటు చేశారు. 13 జిల్లాలకు చెందిన బాలుర, బాలికల 26 టీములకు చెందిన క్రీడాకారులు, వారి పీఈటీలు కలసి సుమారు 650 మంది పుంగనూరుకు చేరుకున్నారు.

 

క్రీడాకారులకు నాణ్యమైన వసతి, బోజన ఏర్పాట్లు చేశారు. క్రీడామైదానంలో వైద్యబ-ందాలను ఏర్పాటు చేశారు. పట్టణంలోని పీఈటీలు చంద్రశేఖర్‌, మహేష్‌, శ్రీనివాస్‌, వెంకటేష్‌ ఆధ్వర్యంలో యువకులు ఏర్పాట్లు చేశారు.

 

 

ప్రజలు న్యాయం, చట్టంపట్ల అవగాహన పెంపొందించుకోవాలి

Tags:Inter-State Kabaddi Contests

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *