ఇంటర్ విద్యార్థిని అదృశ్యం

మంగళగిరి ముచ్చట్లు:
నగరంలోని పాత మంగళగిరి కి చెందిన ఓ ఇంటర్ విద్యార్థిని అదృశ్యమైంది. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల మేరకు… పాత మంగళగిరి కి చెందిన షేక్ జానీ- నాగుల్ మీరా దంపతుల కుమార్తె షేక్ ఆఫ్రిన్ (17)  వీజే  కళాశాలలో  ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 3వ తేదీన ఉదయం కళాశాలకు వెళ్లిన ఆఫ్రిన్  తిరిగి ఇంటికి రాలేదు.  ఆమె స్నేహితులను, బంధువులను  విచారించినా  ఆచూకీ లభించకపోవడంతో తల్లి నాగుల్ మీరా  మంగళవారం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Inter student disappears

Natyam ad