పుంగనూరులో అంతర పంటలను వేసుకోవాలి

పుంగనూరు ముచ్చట్లు:

రైతులు అంతర పంటలను పండించుకుంటు అధిక దిగుబడులు పొందాలని జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయ సంచాలకులు నాగపద్మిని కోరారు. గురువారం మండలంలోని కల్లుపల్లె గ్రామంలో పొలంబడి కార్యక్రమాన్ని ఏవో కళ్యాణబాబు , ఏఈవో జయంతి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ రైతులు వేరుశెనగ పొలంలో కంది, ఉలవ, ఎర్ర పంటలను వేసుకోవాలన్నారు. అలాగే ప్రతిరైతు తాము పండించే పంటలను ఈక్రాప్‌లో నమోదు చేసుకోవాలన్నారు. దీని ద్వారా రైతులకు భీమా , నష్టపరిహారం చెల్లించేందుకు వీలుందన్నారు. రైతులకు అవసరమైన సలహాలు, సూచనలను ఆర్‌బికెల ద్వారా అందిస్తున్నట్లు తె లిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు మమత, లహరి, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Intercropping should be done in Punganur

Leave A Reply

Your email address will not be published.