ప్రపంచానికి ఆసక్తి కలిగించే అంశం అమెరికా అధ్యక్ష ఎన్నికలు

Interest for the world is the presidential election
Date:28/01/2019
న్యూయార్క్ ముచ్చట్లు:
అమెరికా అధ్యక్ష ఎన్నిక కేవలం ఆ దేశానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు. యావత్ ప్రపంచానికి ఆసక్తి కలిగించే అంశం. అమెరికా అధినేతగా అధ్యక్షుడు ఆ దేశ వ్యవహారాలనే కాకుండా ప్రపంచ స్థితిగతులను నిర్దేశించే సత్తా ఉంటుంది. అందువల్ల అగ్రరాజ్య ఎన్నికలు అందరికీ ఆసక్తి కలిగించేవే అనడంలో ఎలాంటి సందేహం లేదు. అమెరికా ఎన్నికలకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. ఇతర దేశాల్లో మాదిరిగా అమెరికాలో ఎన్నికల సంఘం రంగంలోకి దిగడం, ఎన్నికల తేదీలను నిర్ణయించడం అంటూ ఏమీ ఉండదు. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి నవంబరు నెలలో వచ్చే మొదటి మంగళవారం ఏ తేదీ అయితే ఆ తేదీన ఎన్నికలు జరుగుతాయి. ఈ లెక్కన 2020 ఎన్నికలు నవంబరు 3, మంగళవారం జరగనున్నాయి. ఇది శతాబ్దాలుగా వస్తున్న సంప్రదాయం. నవంబరులో మొదటి మంగళవారం ఏ తేదీన వస్తే ఆ తేదేనే ఎన్నికలు నిర్వహిస్తారు. సహజంగా నవంబరు 1 నుంచి ఏడో తేదీలోగా ఎన్నికలు జరుగుతాయి.రెండు శతాబ్దాలకు పైగా అమెరికా చరిత్రలో ఇంతవరకూ ఒక్క మహిళ కూడా అధ్యక్ష పీఠాన్ని అలంకరించలేదు.
స్వేచ్ఛ, సమానత్వం, పురుష వివక్ష గురించి ప్రపంచానికి అదే పనిగా లెక్చర్లు దంచే అగ్రరాజ్యం అధ్యక్ష పీఠం ఇప్పటి వరకూ ఒక్క మహిళకు దక్కకపోవడం లోతుగా ఆలోచించాల్సిన అంశం. ఇక అమెరికా ప్రజాస్వామ్య దేశమైనప్పటికీ అధ్యక్షుడిని ప్రజలు నేరుగా ఎన్నుకోరు. ప్రతినిధులు అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. అమెరికా అధ్యక్షుడు ఎంత శక్తిమంతుడో..అంత బలహీనుడు కూడా. తాజాగా మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మించాలన్న ట్రంప్ నిర్ణయానికి అనేక అడ్డంకులు ఎదురవుతుండటమే ఇందుకు నిదర్శనం. హెచ్చరికలు, బెదిరింపులతో ట్రంప్ కాలక్షేపం చేస్తున్నారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ తరుపున పోటీ చేసేందుకు ఇద్దరు మహిళలు ఆసక్తి చూపుతున్నారు. హిందూ సంతతికి చెందిన వీరిద్దరూ భారతీయ మహిళలు కావడం విశేషం. తులసీ గబ్బర్డ్, కమలా హ్యారిస్ ఎన్నికల బరిలోకి దిగేందుకు ఉత్సాహంగా ఉన్నారు.
బారతీయ సంతతి మహిళలు పోటీ చేయడం ఇదే ప్రధమం అవుతుంది. వాతావరణ మార్పులు, ఆరోగ్య పథకాలు, క్రిమినల్ జస్టిస్ తదితర అంశాల్లో నెలకొన్న సమస్యలను తాను పరిష్కరిస్తానని తులసీ గబ్బర్డ్ హామీ ఇస్తున్నారు. అంతర్జాతీయంగా శాంతిని పెంపొందించేందుకు అవసరమైన చర్యలు చేపడతానని చెబుతున్నారు. వాస్తవానికి తులసీ గబ్బర్డ్ శ్వేతజాతి అమెరికన్. అయితే హిందూ అమెరికన్లకు ఆమె ప్రతినిధిగా నిలిచారు. తులసీ గబ్బర్డ్ హిందూ మతంపై ఎన్నో అధ్యయనాలు చేశారు. మేరీ ల్యాండ్, వర్జీనియా ప్రాంతాల్లోనూ, వాషింగ్టన్ లోనూ 2012లో ఆమె ప్రమాణస్వీకారం సందర్భంగా పలువురు హిందూ దేవాలయాల్లో గంటలు మోగించారు. గబ్డర్డ్ వాస్తవానికి భారతీయ అమెరికన్ కాదు. అయితే హిందూ మతంపై ఆసక్తి చూపిన మహిళగా గుర్తింపు పొందారు. మెడలో హారం, చేతిలో భగవద్గీత తో కన్పించే తులసి అంటే ప్రవాస భారతీయులకు, భారతీయ అమెరికన్లకు ఎంతో అభిమానం, అమెరికన్ నమోవా సంతతికి చెందిన తులసి 2002 లో హవాయి రాష్ట్ర ప్రతినిధిగా ఎన్నికయ్యారు. ఇరాక్ పై అమెరికా యుద్ధం ప్రకటించే నాటికి ఆమె సైన్యంలో ఉన్నారు.
కువైట్ లో యుద్ధం ప్రకటించే నాటికే హవాయి నేషనల్ గార్డుగా, ఆర్మీ కెప్టన్ గా సేవలందించారు. ఉగ్రవాదాన్ని వ్యతిరేకించే తులసి 2011లో సిరియా అధ్యక్షుడు అల్ బహర్ అసద్ ను కలవడం వివాదాస్పదం అయింది. ఆమెకు భారత్ అంటే వల్లమాలిన అభిమానం. ప్రధాని మోదీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో అమెరికా పర్యటనకు వీసా నిరాకరించడాన్ని ఆమె వ్యతిరేకించారు. మోదీ న్యూయార్క్ పర్యటన సందర్బంగా మాడిసన్ స్క్వేర్ లో్ ప్రసంగించినప్పుడు ఆయనను కలసి అభినందించారు. ఇంతటి విస్తృత, ఆసక్తికర నేపథ్యం గల తులసి ఎన్నికల బరిలోకి దిగితే పార్టీతో పాటు ప్రవాస భారతీయులు, అమెరికన్ భారతీయులు ఆమెకు మద్దతు పలకడం ఖాయం. తులసి తల్లి శ్యామల తమిళ మహిళ. ఆమె జమైకా వాసిని పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడ్డారు.డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న మరో మహిళ కమలా హ్యారిస్, అందరికంటే ఈమె పేరు ముందు ప్రచారంలోకి వచ్చింది.
ఆమె భారతీయ సంతతికి చెందిన అమెరికా జాతీయురాలు. తల్లి భారతీయురాలు. తండ్రి ఆఫ్రికన్ అమెరికన్. అమెరికన్ భారతీయులు హ్యారిస్ అభ్యర్థిత్వం పట్ల అంతగా ఆసక్తి చూపడం లేదన్న వాదన ఉంది. తండ్రి ఆఫ్రికన్ కావడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. 1981 ఏప్రిల్ 12న జన్మించిన హ్యారిస్ పూర్తి శాకాహారి కావడం విశేషం. భారతీయతను ఎక్కువగా అభిమానిస్తారు. మొత్తానికి 2020 లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఆసక్తి కరంగా మారింది. డెమొక్రటిక్ పార్టీ వీరిలో ఎవరిని ఎంపిక చేసినా అది చరిత్ర అవుతుంది. భారతీయులకు గర్వ కారణం అవుతుంది. విజేతగా నిలిస్తే యావత్ ప్రపంచం జేజేలు పలుకుతుంది.
Tags:Interest for the world is the presidential election

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *