అమరావతి ముచ్చట్లు:
ఆంధ్ర ప్రదేశ్ లో వైద్య కళాశాలల్లో EWS కోటా సీట్ల జీవోను తాత్కాలికంగా నిలిపివేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. సీట్లు పెంచకుండానే EWS కోటా అమలు చేస్తున్నారని, దీని వల్ల ఓపెన్ కేటగిరి కింద ఉన్న విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. సీట్లు పెంచి EWS కోటా కింద భర్తీ చేయాలని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో జీవోను నిలిపివేస్తూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
Tags: Interim orders of High Court suspending EWS quota in AP