టీడీపీలో ఇంటర్నల్ వార్

Internal War in TDP

Internal War in TDP

Date:13/04/2018
విజయవాడ ముచ్చట్లు:
ఎన్నికలు దగ్గరపడుతుండగా టీడీపీ నేతలలో అలకలు ఎక్కువయ్యాయి. ఇప్పటికే చంద్రబాబుపై అలకబూనిన టీడీపీ సీనియర్లు కొందరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండగా.. మరికొందరు మిగిలిన పార్టీలలో చేరుతున్నారు. తాజాగా మరో టీడీపీ నేత చల్లా రామకృష్ణారెడ్డి చంద్రబాబుపై తన అసహనాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఇటీవలే తనకు ఇచ్చిన ఆర్టీసీ రీజనల్ చైర్మన్ పదవిని కూడా తిరస్కరిస్తున్నట్లు చల్లా ప్రకటించారు. తాను ఎంతో సీనియర్ నేతనైనప్పటికీ, దాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఓ చిన్న పదవిని మాత్రమే ఇచ్చారని, కార్పోరేషన్ పదవులు పొందిన వారిలో తనకన్నా జూనియర్లే ఎక్కువగా ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీకి తానెంతో చేశానని, తన సేవలను మరిచిపోయారని వ్యాఖ్యానించిన ఆయన.. కార్యకర్తలతో చర్చించి, వారి అభీష్టం మేరకు తదుపరి నిర్ణయం తీసుకుంటానని వ్యాఖ్యలు చేశారు. అయితే వైఎస్ బతికున్నంత వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న చల్లా.. ఆ తరువాత టీడీపీలో చేరారు.
Tags: Internal War in TDP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *