అంతర్జాతీయ మాదక ద్రవ్యాల అక్రమ వినియోగ వ్యతిరేక దినం

విజయవాడ ముచ్చట్లు:

 

అంతర్జాతీయ మాదక ద్రవ్యాల అక్రమ వినియోగ వ్యతిరేక దినం సందర్భంగా విజయవాడ లోని పటమట స్టేషన్ సీఐ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మారిస్ స్టెల్లా కాలేజీ యాజమాన్యం, విద్యార్థులు, ఎన్జీఓ లు , పటమట పోలీస్ సిబ్బంది, మహిళా పోలీసులు కలసి భారీ ర్యాలీ మారీస్ స్టెల్లా కాలేజీ నుండి బెంజ్ సర్కిల్ వరకు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఎసిపి భాస్కర్ రావు, గుణదల సీఐ వాసిరెడ్డి. శ్రీను పాల్గొన్నారు. ప్రజలు, విద్యార్థులు ఎవరూ కూడా మాదక ద్రవ్యాల జోలికి పోకుండా ఉండాలని, అలానే మాదక ద్రవ్యాల కు సంబంధించిన సమాచారం పోలీస్ శాఖకు అందించడంలో తమవంతు పాత్ర అందరూ పోషించాలని కోరారు. అలానే సమాచారం అందించే వారి వివరాలు గోప్యంగా ఉంచుతారు అని కోరడం జరిగింది. ఈ సందర్భంగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వ్యతిరేఖంగా పోలీసులు భారీ మానవ హారాన్ని బెంజ్ సర్కిల్ వద్ద నిర్వహించడం జరిగింది.

 

Tags: International Day Against Drug Abuse

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *