ఘణం గా అంతర్జాతీయ శాంతి దినోత్సవ కార్యక్రమం

హైదరాబాద్ ముచ్చట్లు:

నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆద్వర్యం లో అంతర్జాతీయ శాంతి దినోత్సవ కార్యక్రమంను అంగరంగ వైభవంగా జరిఠారు.వివరాల లోకి  వెళ్తే  అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని పురష్కరించుకొని నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆంద్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండురాష్ట్రాల సంయుక్త  నిర్వహణ లో నేడు తెలంగాణ సరస్బత పరిషత్ లో నిర్వహించారు.ఈ కార్యక్రమం లో  బాల బాలికలచే  సాంస్కృతిక కార్యక్రమాలు,జానపద గేయాలు,వివిధ రంగాలలో  గల ప్రముఖుల చే  భాషణలు,కవితలు ఏర్పాటు చేశారు.అంతేకాకుండా కళా పరిషత్  ఆవరణం లో  మెడికల్ క్యాంపు కూడా ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి  దక్షిణ అమెరికా నుండి ,కొరియా నుండి ప్రపంచ శాంతి కోసం పనిచేస్తున్నటువంటి స్వచ్చంద సేవా సంఘాల వ్యవస్థాపకులు తమ శాంతి  సందేహాన్ని ప్రజలకు తెలియజేశారు.

 

 

అలాగే ఈ కార్యక్రమానికి  విశిష్ఠ  అథిదిగా విచ్చేశిన బహుజన సాహిత్య  అకాడమీ జాతీయ అధ్యక్షులు  తమ శాంతి  సందేశాన్ని  ఇస్తూ ఇలాంటి కర్యక్రమాలు దేశమంతటా చేయాలని  ఆయన అన్నారు.ఈ సందర్బంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్  వైస్ చైర్మన్ ఉత్తరాది హరి ప్రసాద్ తమ శాంతి సందేశాన్ని  ఇస్తూ  ప్రతి పౌరుడూ చట్టం గురించి  తెలుసు కోవాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమానికి  అధ్యక్షులు డాక్టర్ పైడి అంకయ్య   మాట్లాడుతూ  గతం లో  ఎన్నో సార్లు ఇటువంటి కార్యక్రమాలు చేశామని,ప్రపంచ శాంతి  దిశగా అడుగులు  వేయాలని  ఆయన అన్నారు.ఈ కార్యక్రమం లో  వీళ్ళతో  పాటుగా ప్రధాన కార్యదర్శి  వినయ్ కుమార్,ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ పన్వి,రాష్ట్ర మహిళా అద్యక్షురాలు రషీదా భేగం,ఛిత్తూరు  జిల్లా  అధ్యక్షురాలు శశికళ,పల్నాడు  అద్యక్షులు నాగిరెడ్డి,ప్రధాన కార్యదర్శి రాజారావు తదితరులు పాల్గొన్నారు.

Tags: International Day of Peace program in earnest

Leave A Reply

Your email address will not be published.