ఘనంగా అంతర్జాతీయ దివ్యంగుల దినోత్సవం

గోనెగండ్ల ముచ్చట్లు:

 


అంతర్జాతీయ దీవ్యంగుల దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలనే ప్రభుత్వం ఆదేశాలమేరకు మండల కేంద్రమైన గొనెగండ్ల  దివ్యంగుల భవిత కేంద్రంలో పాఠశాల ఉపాద్యాయులు అనురాధ,

నారాయణమ్మ ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు, వ్యాపారి ప్రసాద్ శెట్టి 30 మంది దివ్యంగా విద్యార్థులకు ప్లేట్లు పంపిణీ చేశారు,ఈ కార్యక్రమానికి మండల విద్య

అధికారులు రామాంజినేయులు, నీలకంఠప్ప, పాల్గొనగా ముఖ్య అతిథిగా గోనెగండ్ల యస్ ఐ తిమ్మారెడ్డి పాల్గొన్నారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివ్యంగులు నేడు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని

వారికి ఉన్నా  అంగ వైకల్యం అడ్డు కాదని నిరూపించేలా క్రీడల్లో,ఉన్నత ఉద్యోగాల్లో తమ ప్రతిభను చాటుతున్నరని గుర్తుచేశారు,  దివ్యంగులు గర్వించేలా జీవించాలంటే  తల్లి తండ్రుల పాత్ర  చాలా

ముఖ్యమైనదని అధైర్య పడకుండా ఏ రంగంలో నైతే వారు ప్రతిభ కనపరుస్తున్నరో ఆ రంగాల వైపు అవకాశం కల్పించేలా  పెంచినపుడే వారి స్వశక్తి మీద వారు ధైర్యంగా జీవిస్తారని తెలిపారు, ప్రభుత్వం

అంతర్జాతీయ దివ్యంగుల దినోత్సవాన్ని  అధికారికంగా జరపాలని ప్రకటించడం వెనుక వారిని ప్రోత్సహించి,గుర్తించడంతోనే వారి గెలుపుకు బాటలు వేయడం ప్రారంభం కోసమే అని అభిప్రాయ పడ్డారు,

అనంతరం ప్రభుత్వం అందించిన ట్యాబ్ లు పంపిణీ చేయగా వ్యాపారి ప్రసాద్ శెట్టి అందించిన 30 ప్లేట్లను పంపిణీ చేసి విద్యార్థులకు మిఠాయిలు పంచి పెట్టారు, ఈ కార్యక్రమంలో గానిగ బాషా, మాలిక్,

పాల్గొన్నారు.

 

Tags: International Day of Persons with Disabilities

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *