వాటర్‪బేస్ కి అంతర్జాతీయ గుర్తింపు

International recognition of waterbase

International recognition of waterbase

-ఏషియాస్ మోస్ట్ వాల్యుబుల్ బిజినెస్ అవార్డ్ 2018ని సాధించిన వాటర్‪బేస్
Date:15/03/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
భారతదేశంలో అత్యంత నాణ్యమైన రొయ్య మేత తయారీదారైన వాటర్‪బేస్ లిమిటెడ్ (వాటర్‪బేస్) వారు ష్రింప్ ఫీడ్ విభాగంలో ప్రతిష్టాత్మకమైన, ఏషియాస్ మోస్ట్ వాల్యుబుల్ బిజినెస్ బ్రాండ్ అవార్డ్ 2018 ని సాధించింది.సింగపూర్ లోని రిట్జ్ కార్లటన్ లో నిర్వహించిన ఆసియన్ బ్రాండ్,లీడర్షిప్ కాంక్లేవ్ సింగపూర్ 2018 కార్యక్రమంలో వాటర్‪బేస్ లిమిటెడ్ సిఇఒ రమాకాంత్ వి. ఆకుల ఈ ప్రతిష్టాత్మక అవార్డుని స్వీకరించారు.ఈ అవార్డు సాధించిన సందర్భంగా మాట్లాడుతూ, ఆకుల, “ఇంతటి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ వేదిక పై మాకు లభించిన గుర్తింపుకి ఆనందంగా వుంది. వాటర్‪బేస్ చరిత్రలో ఇది ఇంకో కీలకమైన మైలురాయన్నారు. ఉన్నత ప్రమాణాలు,  పునరావిష్కరణల కోసం వాటర్‪బేస్ లో మేం నిరంతరం శ్రమిస్తూ వుంటామన్నారు. రొయ్యల ఎగుమతిలో ఈనాడు భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఎగుమతిదారుగా వుందని పేర్కొన్నారు. ఈ విజయగాధలో భాగస్తులమైనందుకు వాటర్‪బేస్ గర్విస్తోంది” అన్నారు.ఏషియాస్ మోస్ట్ వాల్యుబుల్ బిజినెస్ బ్రాండ్స్ అనేది ఐబ్రాండ్స్ 360 వారు డబ్యుసిఆర్‪సిఐఎన్‪టి‪ తో కలిసి అభివృద్ధిచేసిన కాన్సెప్ట్. వీరి అవార్డులు, పరిశ్రమలో ఆ విభాగంలో సారథ్యస్థానంలో వున్నట్టుగా ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెడతాయి. ఇవి బ్రాండ్ భాగస్వాములు, బ్రాండ్ విలువ ప్రణాళికలు, బ్రాండ్ గుణగణాలు, ప్రతిష్ట, బ్రాండ్ పునరావిష్కరణ, సామాజిక చైతన్యం, మార్కెటింగ్ కనెక్ట్, ‘కల్ట్ ప్రీమియం’ (వినియోగదారుల చర్యలని ప్రభావితం చేయగలిగే స్వభావం), విస్తృతస్థాయిలో దానికి వ్యాఖ్యానం, బహుళార్థకమైన పోటీదారు అనుకూలతలు వంటి అంశాల ఆధారంగా ఈ అవార్డులని నిర్ణయిస్తారు. ఏషియాస్ మోస్ట్ వాల్యుబుల్ బిజినెస్ బ్రాండ్స్ అనేది భారతదేశంలో వ్యాపారప్రపంచంలో ఎవరు ఏమిటి అన్నది నిర్ణయిస్తుంది.
Tags: International recognition of waterbase

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *