భారత్ కు మళ్లీ అంతర్జాతీయ మద్దతు

Date:24/06/2020

న్యూఢిల్లీ  ముచ్చట్లు:

అంతర్జాతీయంగా భారత్‌కు మరోసారి గట్టి మద్దతు లభించింది. ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో భారత్ శాశ్వత సభ్యదేశంగా ఉండేందుకు మద్దతిస్తామని రష్యా విదేశాంగ మంత్రి సెర్జ్ లారోవ్ తెలిపారు. భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం వస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ బలమైన అభ్యర్థి అని ఆయన వ్యాఖ్యానించారు. రష్యా-భారత్‌-చైనా త్రైపాక్షిక కూటమి సమావేశం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన ఈ సమావేశంలో విదేశాంగ మంత్రులు వాంగ్‌ యి (చైనా), సెర్జ్‌ లారోవ్‌ (రష్యా), జైశంకర్‌ (భారత్‌) హాజరయ్యారుఈ సమావేశంలో ఐరాస సంస్కరణలపై ప్రధానంగా చర్చ జరిగింది. భారత్‌, చైనా సరిహద్దు అంశంపైనా రష్యా విదేశాంగ మంత్రి లారోవ్‌ స్పందించారు. ఇరు దేశాల మధ్య శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. భారత్‌, చైనాకు బయటి వ్యక్తుల సాయం అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ద్వైపాక్షికంగా, శాంతియుతంగానే సరిహద్దు అంశాన్ని పరిష్కరించుకుంటారని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

 

దీనిపై ఇరు దేశాల రక్షణ అధికారులు, విదేశాంగ మంత్రులు ఇప్పటికే చర్చలు ప్రారంభించారని గుర్తు చేశారు.అంతర్జాతీయ సంబంధాలు, సంప్రదాయాలను గౌరవించాలని భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ పేర్కొన్నారు. బహుముఖ వ్యవస్థలకు మద్దతిస్తూ ఉమ్మడి వస్తువులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ సంబంధాలు, సంప్రదాయాలను గౌరవిస్తూ.. లక్ష్యాలు, నిబంధనలను పాటించాలని సూచించారు. అంతర్జాతీయ చట్టాలను గౌరవిస్తూ, భాగస్వాముల న్యాయబద్ధమైన ప్రయోజనాలను గుర్తించాలని జైశంకర్ కోరారు.

 

జైశంకర్ కీలక అంశాలను లేవనెత్తారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత భారత్‌కు తగినంత గుర్తింపు రాలేదని తెలిపారు. ఇప్పటికైనా ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించే అంశంపై రష్యా ఇప్పటికే పలుమార్లు తన మద్దతు ప్రకటించింది. ఆస్ట్రేలియా తదితర దేశాలు కూడా మద్దతు ప్రకటించాయి. కరోనా సంక్లిష్ట సమయంలో అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలతో భారత్‌ తన సంబంధాలను మెరుగుపర్చుకోవడం కలిసొచ్చే అంశం. ఐక్యరాజ్యసమితిలో రెండేళ్ల కాల పరిమితికి గాను తాత్కాలిక సభ్యత్వానికి ఇటీవల భారత్‌ భారీ మెజార్టీతో ఎన్నికవడం శుభసూచకం.ఈ త్రైపాక్షిక కూటమికి రష్యా నేతృత్వం వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులు, ఆర్థిక, సామాజిక అంశాలతో పాటు కరోనా వైరస్‌ ప్రభావంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది రెండో ప్రపంచ యుద్ధం జరిగి 75 ఏళ్లు పూర్తవుతుండటం, ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన రోజున  భేటీ జరగడం ప్రాధాన్యం సంతరించుకుందని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పేర్కొన్నారు.

కరోనా వేళ బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్

Tags:International support once again for India

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *