దేశవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు

మైసూరులో యోగా కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ

మైసూరు  ముచ్చట్లు:


దేశవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా 75 నగరాల్లో యోగా వేడుకలు జరుగుతుండగా.. కర్నాటక మైసూరులో యోగా కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ‘యోగా ఫర్ హ్యుమానిటీ’ నినాదంతో ఈ ఏడాది ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన యోగా దినోత్సవ వేడుకలు రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ పాల్గొని, యోగా ఆసనాలు వేశారు. దేశ రాజధాని దిల్లీ త్యాగరాజ స్టేడియంలో దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఉత్తర్‌ప్రదేశ్ నోయిడాలో బీజేపీ అధ్యక్షుడు జేపీనడ్డా, రిషికేశ్‌లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి పాల్గొన్నారు. పలు ప్రాంతాల్లో కేంద్రమంత్రులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: International Yoga Day celebrations across the country

Post Midle
Natyam ad