అంతర రాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్
నందిగామ ముచ్చట్లు:
పలు ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులనుంచి 580 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల ఎన్.టి.ఆర్ జిల్లా లో జరుగుతున్న దొంగతనాలు, యు చైన్ స్నాచింగ్ లపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అనుమానితుల కదలికలపై పూర్తి నిఘా ఏర్పాటు చేసారు.
ఈ క్రమంలో నందిగామ సబ్ డివిజన్ పరిధిలో ఎక్కువ చైన్ స్నాచింగ్ లు జరుగుతున్నట్లు వచ్చిన పిర్యాదుల నేపధ్యంలో నందిగామ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీ కె.సతీష్, నందిగామ ఎస్.ఐ.లు పి.సురేష్, ఎం. పండుదొర గార్లు వారి సిబ్బందితో కలిసి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సాంకేతిక పరిజ్ఞానంతో నందిగామ చుట్టుప్రక్కల ప్రాంతాలలో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసారు.
బుధవారం సాయంత్రం వచ్చిన పక్కా సమాచారం మేరకు నందిగామ గ్రామ శివారులో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి సుమారు 34 లక్షల విలువైన 580 గ్రాముల బంగారు ఆభరణాలు (చోరీ సొత్తు)ను మరియు రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసారు.

Tags;Interstate chain snatching gang arrested
