Natyam ad

అక్రమ మద్యం రవణాలకు సంబంధించి అంతరాష్ట్ర సమన్వయ సమావేశం

చిత్తూరు ముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో జరగబోవు ఎన్నికలకు సంబంధించి అక్రమ మద్యం మరియు ఇతర అక్రమ రవణాలకు సంబంధించి చిత్తూరు సరిహద్దు జిల్లా పోలీసులతో అంతరాష్ట్ర సమన్వయ సమావేశం జరిపిన చిత్తూరు జిల్లా పోలీసులు.రానున్న రోజులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో జరగబోవు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని చిత్తూరు సరిహద్దు జిల్లాలు అయిన కోలార్, కృష్ణగిరి, కె.జి.ఎఫ్ మరియు అన్నమయ్య జిల్లా పోలీసులతో చిత్తూరు జిల్లా ఎస్ పి  వై.రిశాంత్ రెడ్డి, ఐపిఎస్  ఆదేశాల మేరకు పలమనేరు డి.ఎస్పీ  ఎన్. సుధాకర్ రెడ్డి  మరియు సరిహద్దు ప్రాంతాల ఇన్స్పెక్టర్ లతో కలిసి జిల్లా ఎస్ పి లు మరియు వారి అధికారులతో కోలార్ కమిషనర్ గారి కార్యాలయంలో అంతరాష్ట్ర సరిహద్దు సమన్వయ సమావేశంలో పాల్గొన్నారు.ఎన్నికల సందర్భంలో ఈ పోలీసు స్టేషన్ ల పరిధిలో తీసుకోవలసిన చర్యలు మరియు జాగ్రత్తల గురించి చర్చించారు.

 

Post Midle

ఈ సమావేశంలో చర్చించిన ముఖ్యంశాలు
1) ఎన్నికల సందర్బంగా సరిహద్దు ప్రాంతాలలో ఏర్పాటు చేయదలచిన చెక్ పోస్ట్ ల గురించి చర్చ
2) సరిహద్దు ప్రాంతం నుండి అక్రమ మద్యం మరియు వస్తువుల తరలింపు పై చర్చ.
3) అంతరాష్ట్ర నేరస్తుల గురించి, వారి కదలికల గురించి చర్చ
4) ఓటర్ల కదలికలు మరియు అలాగే మధ్యవర్తిత్వం చర్చ
5) Excise డిపార్టుమెంటు సహాయంతో I.D arrack కట్టడిపై చర్చ
పలమనేరు డి.ఎస్పీ  మాట్లాడుతూ జరగబోవు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల వేళ సరిహద్దు ప్రాంతాలలో గట్టి నిఘా ఏర్పాటు చేస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టుట మరియు అక్రమ మద్యం రవాణాను అరికట్టి సంయుక్తంగా అంతరాష్ట్ర సరిహద్దు ప్రాంతాలలో నిఘా తో బాటు, వాహనాల తనికిలు, Excise డిపార్టుమెంటు వారితో కలసి ID arrack కట్టడి కి దాడులు చేయువిదంగా మరియు ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిగేటట్లు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.ఈ సమవేశంలో పాల్గొన్న అధికారులు పలమనేరు SDPO  ఎన్. సుధాకర్ రెడ్డి, కోలార్, కె.జి.ఎఫ్ జిల్లా ఎస్పీ  శాంతరాజ్, కోలార్ డిప్యూటీ కమిషనర్ అక్రమ్ పాషా, కోలార్ అడిషనల్ ఎస్పీ  జగదీష్, Excise డిపార్టుమెంటు అధికారులు మరియు చిత్తూరు సరిహద్దు పోలీస్ స్టేషన్ ల ఇన్స్పెక్టర్ లు పాల్గొన్నారు.

 

Tags:Interstate Coordinating Conference on Illicit Liquor Exports

Post Midle