అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

-17 ద్విచక్రవాహనాలు స్వాధీనం
– రూ.16 లక్షల విలువ
– సీఐ గంగిరెడ్డి

Date:18/09/2020

పుంగనూరు ముచ్చట్లు:

వివిధ రాష్ట్రాలలో ద్విచక్రవాహనాలను దొంగతనం చేసి తీస్రుకెళ్లే అంతరాష్ట్ర ముఠాను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.16 లక్షలు విలువ చేసే 17 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని సీఐ గంగిరెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆయన ఎస్‌ఐ ఉమా మహేశ్వరరావుతో కలసి అంతరాష్ట్ర ముఠా అరెస్ట్పై వివరించారు. ఆయన తెలిపిన మేరకు ఉదయం అరవపల్లె వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా ఆరు మంది ద్విచక్రవాహనాలలో వెళ్తుండగా అనుమానం వచ్చి పట్టుకున్నామన్నారు. అందులో ఒకరు పరారైయాడని, పుంగనూరు మండలం బండ్లపల్లెకు చెందిన కిరణ్‌కుమార్‌, పట్టణానికి చెందిన ఆనంద్‌, మదనపల్లెకు చెందిన రవితేజ, వెంకటసాయికుమార్‌లు నేరాలకు పాల్పడ్డారన్నారు. ఈ ముఠాలో ఒక మైనర్‌ బాలుడు ఉన్నాడని తెలిపారు. ఈ ముఠా ద్విచక్రవాహనాలను దొంగలించే ముఠాగా గుర్తించి, దొంగతనం కాబడిన 17 వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటి విలువ రూ.16 లక్షలను తెలిపారు. పలమనేరు, పుంగనూరు, మదనపల్లెతో పాటు కర్నాటక, తెలంగాణ, ర్ఖా•లలో ఈ ముఠా చోరీలకు పాల్పడిందని సీఐ తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన పోలీసులకు ఎస్పీ సెంథిల్ కుమార్ ఆదేశాల మేరకు నగదు బహుమతి అందజేశారు. బహుమతులు పొందిన పోలీసులు రెడ్డెప్ప, యల్లప్ప, గురురాజ, కేశవరాజు, నాగభూషణ్‌, కుమార్‌, నాగేంద్రబాబు, మోహన్‌రామ్‌, మోహన్‌రె డ్డి, శంకర్‌, మునిసుందరం ఉన్నారు. వీరిని సీఐ అభినందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, నింధితులను అరెస్ట్ చేసి , రిమాండుకు తరలించామన్నారు.

సచివాలయ సేవల్లో పుంగనూరు ఫస్ట్

Tags: Interstate gang arrested

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *