అంతరాష్ట్ర ఎర్రచందన స్మగ్లర్ అరెస్ట్
-పరారీ లో మరో ఐదుమంది నిందితులు
తిరుపతి ముచ్చట్లు:
తిరుపతి జిల్లా వెస్ట్ సబ్ డివిజన్ బాకరాపేట సర్కిల్ ఎర్రావారిపాల్యం పరిధిలో కోటి రూపాయలు విలువగల ఎర్ర చందనం దుంగలను మరియు రెండు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను శనివారం ఎస్పీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను జిల్లా ఎస్పీ పి.పరమేశ్వర రెడ్డి, తెలియజేసారు. శుక్రవారం సాయంత్రం వచ్చని ఒక సమాచరం మేరకు భాకరాపేట సి.ఐ తులసి రాం, యస్.ఐ లు ప్రకాష్, వెంకటేశ్వర్లు, వారి సిబ్బంది ఎర్రావారిపాలెం మండలం, యల్లమంద పంచాయతీ, యల్లమంద – ఉస్తికాయల పెంట రోడులోగల యల్లమంద క్రాస్ వద్ద తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా అంతరాష్ట్ర ఎర్రచందన స్మగ్లర్స్ ముఠాకు చెందిన ఒకరిని అరెస్ట్ చేసి, సుమారు కోటి రూపాయల విలువగల 31 ఎర్రచందనం దుంగలు, 02 కారు, 02 ద్విచక్ర వానాలు స్వాదీనం చేసుకోవడమైనది. పరారీలో ఐదు మంది ముద్దాయిలు ఉన్నారని ఎస్పీ వెల్లడించారు.

Tags; Interstate red sandalwood smuggler arrested
