న‌వంబ‌రు 23న 5 ఔట్‌సోర్సింగ్ పోస్టుల భ‌ర్తీకి ఇంట‌ర్వ్యూలు

Interviews for filling out 5 outsourcing posts on November 23

Interviews for filling out 5 outsourcing posts on November 23

Date:17/11/2019

తిరుప‌తి ముచ్చట్లు:

కురుక్షేత్ర మరియు హైదరాబాద్ లోని శ్రీ‌వారి ఆల‌యాల్లో సేవలందించేందుకు అర్చ‌క సిబ్బంది, మేళం సిబ్బంది క‌లిపి 10 ఔట్‌సోర్సింగ్ పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు న‌వంబ‌రు 23వ తేదీన ఉద‌యం 10 గంట‌ల‌కు తిరుప‌తిలోని శ్వేత భ‌వ‌నంలో ఇంట‌ర్వ్యూలు జ‌రుగ‌నున్నాయి. కురుక్షేత్రలోని శ్రీవారి ఆలయంలో అర్చ‌క 1 (పాంచరాత్ర), పరిచారక 1, వేద‌పారాయ‌ణం 1, అధ్యాప‌క 1, నాద‌స్వ‌రం 1, శృతి 1 పోస్టులున్నాయి. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో గల శ్రీవారి ఆలయంలో అర్చ‌క 2 (వైఖానస), హిమాయత్ నగర్ లోని శ్రీవారి ఆలయంలో పోటు వర్కర్లు 2 పోస్టులున్నాయి. ఆస‌క్తి, అర్హ‌త గ‌ల అభ్య‌ర్థులు ఒరిజిన‌ల్ ధ్రువీక‌ర‌ణ‌ప‌త్రాలు, రెండు సెట్ల జెరాక్స్ కాపీలు, 3 పాస్‌పోర్టు సైజు ఫొటోలు తీసుకురావాల్సి ఉంటుంది.

శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల ప్రత్యేకవ్యాసం

 

Tags:Interviews for filling out 5 outsourcing posts on November 23

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *