వలంటీర్ల నియామకాలకు ఇంటర్వ్యూలు

Interviews for volunteer placementsInterviews for volunteer placements

Date:20/07/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మున్సిపాలిటిలోని అన్ని వార్డులకు వలంటీర్ల నియామక ఇంటర్వ్యూలను శనివారం కమిషనర్‌ కెఎల్‌.వర్మ ఆధ్వర్యంలో టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌ క్రిష్ణారావు , అకౌంట్స్ ఆఫీసర్‌ మనోహర్‌, మేనేజర్‌ రసూల్‌ఖాన్‌ కలసి నిర్వహించారు. 2, 24 వార్డులలో 51 మంది ఇంటర్వ్యూలకు రావాల్సి ఉండగా 35 మంది మాత్రమే హాజరైయ్యారు.

మండలంలో…

మండలంలోని అన్ని పంచాయతీలకు వలంటీర్ల నియామకాలకు శనివారం ఎంపీడీవో లక్ష్మిపతినాయుడు, ఈవోఆర్‌డి వరప్రసాద్‌ కలసి పదోవరోజు ఇంటర్వ్యూలు నిర్వహించారు. మండలంలోని భీమగానిపొల్లె, వనమలదిన్నె పంచాయతీలలోని వలంటీర్లకు ఇంటర్వ్యూలు నిర్వహించారు.

21 ఇంటర్వ్యూలు జరిగే గ్రామాలు…

పుంగనూరు ఎంపీడీవో కార్యాలయంలో ఆదివారం పదకొండవ రోజు ఇంటర్వ్యూలు ఉదయం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో లక్ష్మిపతినాయుడు తెలిపారు. భీమగానిపల్లె గ్రామ వలంటీర్లకు ఇంటర్వ్యూలు చేపడుతున్నామన్నారు. అభ్యర్థులు తమ ఒరిజనల్‌ రికార్డులతో ఇంటర్వ్యూలకు హాజరుకావాలని కోరారు.

హరీష్ రావు పరిస్థితి ఏమిటిప్పుడు

Tags: Interviews for volunteer placements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *