వలంటీర్ల నియామకాలకు ఇంటర్వ్యూలు

Interviews for volunteer placements

Interviews for volunteer placements

Date:15/07/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మున్సిపాలిటి పరిధిలోని 24 వార్డులకు వలంటీర్ల నియామక ఇంటర్వ్యూలను సోమవారం కమిషనర్‌ కెఎల్‌.వర్మ , టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌ క్రిష్ణారావు , అకౌంట్స్ ఆఫీసర్‌ మనోహర్‌ కలసి నిర్వహించారు. మున్సిపాలిటిలో 532 పోస్టులకుగాను 741 మంది ధరఖాస్తు చేసుకున్నారు. వీటిలో 617 ధరఖాస్తు దారులు అర్హులుగా నిర్ణయించామన్నారు. షెడ్యూల్‌ మేరకు తేదీలను నిర్ణయించి, సమాచారం అందించారు. 15, 20, 23 వార్డులలోని 45 మందికి ఇంటర్వ్యూలు నిర్వహించారు.

16న ఇంటర్వ్యూలు జరిగే వార్డులు…

పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయంలో వలంటీర్ల నియామకాలకు మంగళవారం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కమిషనర్‌ కెఎల్‌.వర్మ తెలిపారు. ఉదయం 10 నుంచి ఇంటర్వ్యూలను నిర్వహిస్తామన్నారు. పట్టణంలో 19, 20, 21 గల వార్డులకు ధరఖాస్తు చేసుకున్న 45 మంది నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. నిరుద్యోగులు తమ ఒరిజనల్‌ సర్టిపికెట్లతో హాజరుకావాలెనని కోరారు.

మండలంలో…

మండలంలోని 23 పంచాయతీలలో వలంటీర్ల నియామకాలకు సోమవారం ఎంపీడీవో లక్ష్మిపతినాయుడు, ఈవోఆర్‌డి వరప్రసాద్‌ కలసి ఐదవరోజు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించారు. మండలంలో మొత్తం 291 ఉద్యోగాలకు గాను 1240 మంది నిరుద్యోగులు ధరఖాస్తు చేశారు. 1:4 నిష్పత్తిలో వీరికి ఇంటర్వ్యూలు నిర్వహించారు. మండలంలోని బండ్లపల్లె , చదళ్ల, మాగాండ్లపల్లె, సుగాలిమిట్ట పంచాయతీలలోని వలంటీర్లకు ఇంటర్వ్యూలు నిర్వహించారు.

16న ఇంటర్వ్యూలు జరిగే గ్రామాలు…

పుంగనూరు ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం ఆరవ రోజు ఇంటర్వ్యూలు ఉదయం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో లక్ష్మిపతినాయుడు తెలిపారు. ఈ మేరకు మండలంలోని రాగానిపల్లె, చదళ్ల, నెక్కుంది గ్రామ వలంటీర్లకు ఇంటర్వ్యూలు చేపడుతున్నామన్నారు. అభ్యర్థులు తమ ఒరిజనల్‌ రికార్డులతో ఇంటర్వ్యూలకు హాజరుకావాలని కోరారు.

తిరుమల విఐపీ దర్శనాలపై హైకోర్టులో విచారణ

Tags: Interviews for volunteer placements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *