Natyam ad

జగనన్న కాలనీ పై భూ బకాసురుల “దండయాత్ర”

ఎన్టీఆర్ జిల్లా  ముచ్చట్లు:

కబ్జా కోరల్లో “జగనన్న కాలనీలోని సిపి ల్యాండ్ .ఎన్టీఆర్ జిల్లా, మైలవరం నియోజకవర్గం, ఇబ్రహీంపట్నం.సడక్ రోడ్డు లోని జగనన్న కాలనీలో సిపి ల్యాండ్ ను సైతం కబ్జా చేస్తున్నారు భూ బకాసురులు.కబ్జా చేయడం ఒక ఎత్తయితే అందులోను రోడ్డు ఫేసింగ్ కదా…అందులో వ్యాపారం చేసుకుంటే అబ్బో.ఒకడిని చూసి మరొకడు అన్న విధంగా ఒకరు కబ్జా చేస్తే రెండో వాడు ఊరుకుంటాడా.దొంగా దొంగా అంటే నా వెనుక ఉన్న వాడు నీ చుట్టమా అన్నట్లుగా ఒకరి వెనుక మరొకరు ఎంచక్కా కబ్జా చేసేశారు.కబ్జా చేసిన స్థలం గురించి గతంలోనే అధికారుల దృష్టికి వచ్చిందని ఐనా కూడా వారిపై చర్యలు తీసుకోకుండా రెవెన్యూ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు అంటూ ఒక వాదన వినిపిస్తోంది.ఐనా మనల్ని అదిగేదెవడు నాకు వాళ్లు తెలుసు వీళ్ళు తెలుసు అంటూ సొల్లు కబుర్లు చెప్పుకుంటూ అధికారులను సైతం పక్కదారి పట్టిస్తున్నారు.ఒకటి కాదు రెండు కాదు ఇలా ఎన్నో స్థలాలు జగనన్న కాలనీ లో కబ్జాకు గురయ్యాయి…అనేది ముమ్మాటికీ నిజం కానీ వాటి సంఖ్య? ఎంత అనేది ఇకపై తేలాల్సి ఉంది.పాపం అధికారులు మాత్రం ఇప్పుడేమి చేస్తారులే వందలసార్లు సర్వేలు పేరుతో అటువైపుగానే తిరుగుతున్నా కూడా వారికి తెలియదంటే “ఓరా ” నిజమేనా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు కొందరు స్థానికులు.అసలు ఈ కబ్జా కథేంటో… ఈ కబ్జా వెనుక ఉన్నదెవరు అనేది మరో కథనంలో.

 

Post Midle

Tags:”Invasion” of Bhu Bakasuras on Jagananna Colony

Post Midle