అన్న‌మ‌య్య భ‌క్తి రంజ‌ని సిడి ఆవిష్కరణ

Date:15/08/2019

తిరుపతిముచ్చట్లు:

శ్రీవారు జన్మించిన శ్రవణానక్షత్రాన్ని పురస్కరించుకుని బుధ‌వారం సాయంత్రం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో “అన్న‌మ‌య్య భ‌క్తి రంజ‌ని” సిడిని అన్న‌మాచార్య ప్రాజెక్టు డైరెక్ట‌ర్ ఆచార్య బి.విశ్వనాథ్‌ ఆవిష్కరించారు.

ఈ సిడిలోని సంకీర్త‌న‌ల‌ను ఎస్వీ సంగీత క‌ళాశాల అధ్యాప‌కులు శ్రీ ఎ.శ‌బ‌రిగిరీష్ స్వ‌ర‌ప‌రిచారు. కుమారి మీనాక్షి శ‌బ‌రి, కుమారి రేఖతో క‌లిసి శ్రీ శ‌బ‌రిగిరీష్ ఈ సిడిలోని సంకీర్త‌న‌ల‌ను గానం చేశారు. ఈ సందర్భంగా గాయ‌కుల‌ను శాలువతో సన్మానించి శ్రీవారి తీర్థప్రసాదాలను అందించారు. అనంతరం గాయ‌నీ గాయ‌కులు ఈ సంకీర్తనలను అద్భుతంగా పాడి వినిపించారు.

ఈ సిడిలోని సంకీర్తనలను టిటిడి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. భక్తులు ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పించారు.

ఆర్టికల్ 370 రద్దుతో పటేల్ కల సాకారం చేశాం: జాతినుద్దేశించి ప్రసంగించిన మోదీ. 

Tags: Invention of brother-in-law Bhakti Ranjani CD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *