భారత రాజ్యాంగం పుస్తకాల ఆవిష్కరణ
కడప ముచ్చట్లు:
భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వైస్సార్సీపీ దళిత నాయకులు పల్లెకొండు సంపత్ కుమార్, చైతల్య ల ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం పుస్తకాలను ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు ఎం ఎల్ ఏ కొరముట్ల శ్రీనివాసులు , ఏపి ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి ,సోషల్ వెల్ఫేర్ చైర్మన్ పులి సునీల్ లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సంపత్, చైతల్య లు తలపెట్టిన ఇంటింటికి రాజ్యాంగం పుస్తకాల పంపిణీ చాలా బృహత్తర మైందని ప్రతి ఒక్కరూ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రసాదించిన హక్కులు తెలుసుకోవడానికి ఎంతగానో రాజ్యాంగం ఉపయోగ పడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో చెన్నయ్య,జాషువా,శ్యాంసున్, నాయక్ ,నరసింహ,పాల్గొన్నారు.
Tags: Invention of Indian Constitution Books

