Natyam ad

శ్రీశైలయాత్ర గ్రంథం ఆవిష్కరణ

శ్రీశైలం ముచ్చట్లు:

కొమ్మంటి అశోక్ కుమార్  వ్రాసిన శ్రీశైలయాత్ర కన్నడ గ్రంథాన్ని  ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజులు ఆవిష్కరించారు.
పరిపాలనా భవన కార్యాలయములోని సమావేశమందిరంలో జరిగిన ఈ ఆవిష్కరణ కార్యక్రమములో పలువురు ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.
నాగలూటి నుంచి శ్రీశైలానికి నడకదారిలో వచ్చే భక్తులకు తగు మార్గదర్శకంగా వీరు ఈ శ్రీశైలయాత్ర గ్రంథాన్ని రచించడం జరిగింది. 2008 సంవత్సరంలో వీరు తెలుగులో రచించిన శ్రీశైల గ్రంథానికి అనువాదంగా ప్రస్తుత కన్నడ గ్రంథం వెలువడింది.
ఈ గ్రంథంలో రచయిత శ్రీశైల కాలిబాటలోని నాగలూటి వీరభద్రస్వామి ఆలయం, దామెర్లకుంటు, పెద్దచెరువు, మఠంబాయి, భీమునికొలను, కైలాసద్వారం మొదలైన ప్రదేశాలను ప్రస్తావించారు.
సందర్భానుసారంగా ఆయా ఛాయా చిత్రాలను కూడా ఈ గ్రంథంలో ముద్రించారు.

Post Midle

Tags:Invention of Srisailayatra Granth

Post Midle