అరకు ఘటనపై దర్యాప్తు ముమ్మరం

Investigation is on the incident

Investigation is on the incident

Date:25/09/2018

విశాఖపట్టణం ముచ్చట్లు:

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకొని.. కేసుకు సంబంధించిన ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. హత్య జరిగిన సమయంలో అక్కడే ఉన్న ప్రత్యక్ష సాక్షుల్ని ప్రశ్నించిన పోలీసులు.. వారు చెప్పిన సమాచారంతో.. ఈ దాడిలో పాల్గొన్న ముగ్గురు మావోలను గుర్తించారు.

ఈ ముగ్గురు అరుణ అలియాస్ చైతన్య.. స్వరూప అలియాస్ కామేశ్వరి.. జులుమూరి శ్రీనుబాబు అలియాస్ సునీల్‌లు. వీరిలో అరుణది విశాఖ జిల్లా కరకపాలెం.. స్వరూపది పశ్చిమగోదావరి జిల్లా భీమవరం.. శ్రీనుబాబుది విశాఖ జిల్లా దబ్బపాలెం మండలం అడ్డతీగల. ఈ కేసులో కీలకమైన వీడియో ఫుటేజ్‌ను మంగళవారం పోలీసులు సేకరించారు.

కిడారి, సోమ హత్యకు ముందు.. దాడి జరిగిన తర్వాత ఘటనా స్థలంలోని వీడియోలను విడుదల చేశారు. దాడికి ముందు దాదాపు 10మందికి పైగా మావోయిస్టులు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కారును చుట్టుముట్టినట్లు వీడియోలో స్పష్టంగా కనిపించింది. కొందరి చేతుల్లో తుపాకీలు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మరో వీడియోలో.. కిడారి, సోమలను కాల్చి చంపిన ప్రాంతం నుంచి ఇద్దరు పారిపోతూ కనిపించారు.

వారిలో ఓ యువకుడు, మరో మహిళ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారిద్దర్ని జులుమూరి శ్రీనుబాబు అలియాస్ సునీల్ అలియాస్ రైనో.. స్వరూప అలియాస్ కామేశ్వరిలుగా అనుమానిస్తున్నారు. ఈ రెండు వీడియోలను ఘటన జరిగిన సమయంలో స్థానికులు కొందరు తమ మొబైల్స్‌లో రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది.

ప్రత్యక్ష సాక్షుల్ని ప్రశ్నించిన సమయంలో.. ఈ వీడియోలు కూడా పోలీసులు సేకరించినట్లు సమాచారం. ఈ దాడిలో నందపూర్ ఏరియా కమిటీకి కేంద్ర కమిటీ సహకారం అందించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు మన్యంలో కూంబింగ్‌ను కూడా ముమ్మరం చేశారు పోలీసులు. అటవీ ప్రాంతం మొత్తాన్ని జల్లెడపడుతున్నారు.

నేర చరితుల విషయంలో లక్ష్మణ రేఖ దాటలేం

Tags:Investigation is on the incident

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *