కనిపించని నల్లపోచమ్మ

Date:11/08/2020

హైద్రాబాద్ ముచ్చట్లు:

తెలంగాణ సెక్రటేరియట్ కూల్చివేత పనులు పూర్తయ్యాయి. కొత్త సచివాలయ డిజైన్‌ను ప్రభుత్వం ఓకే చేసింది. త్వరలోనే టెండర్లను పిలిచే అవకాశం ఉంది. కాగా సచివాలయ కూల్చివేత సమయంలో అదే ప్రాంగణంలో ఉన్న నల్లపోచమ్మ ఆలయం, మసీదుపై శిథిలాలు పడటంతో అవి దెబ్బతిన్నాయి. దీంతో ఆ ప్రార్థనా మందిరాలను సైతం కూల్చేశారు. ఆ ఆలయంలో నల్లపోచమ్మ విగ్రహం గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది. నల్లపోచమ్మ విగ్రహం ఎక్కడుంది? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ విగ్రహం గురించి ఆలయ పూజారికి కూడా తెలియదా? ఆ విగ్రహానికి రోజూ పూజలు నిర్వహిస్తున్నారా లేదా? అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి.ఆలయ కూల్చివేత సమయంలో నిత్యం పూజలు చేసే పూజారులకు తెలియకుండానే.. గజ్వేల్‌కు చెందిన పూజారులతో పూజలు చేయించి.. విగ్రహాన్ని మరో చోటుకు తరలించారని తెలుస్తోంది. విగ్రహాన్ని కదిలించే ముందు పూజాధికాలు చేశారో లేదో.. ప్రస్తుతం ఆ విగ్రహం ఎక్కడుందో తెలియదని పూజారులు చెబుతున్నారు.నల్ల పోచమ్మ తల్లికి రోజూ పూజలు చేయాలని లేదంటే అరిష్టమని పూజారులు చెబుతున్నారు. కలశం లేకుండా అమ్మవారి విగ్రహాన్ని భద్రపరచడం శాస్త్రోక్తం కాదని చెబుతున్నారు. సెక్రటేరియట్ సమీప ప్రాంతాల్లోని ఇతర ఆలయాల్లో అమ్మవారి విగ్రహం ఉంచారేమోనని పరిశీలించామని.. కానీ లేదంటున్నారు. నల్లపోచమ్మ విగ్రహాన్ని ఎక్కడ ఉంచారు. రోజూ పూజలు జరుగుతున్నాయా అనే విషయాలను చెప్పాలని పూజారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

కర్ణాటక మద్యం తరలిస్తున్న ముగ్గురు అరెస్టు

Tags: Three arrested for moving Karnataka liquor…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *