Natyam ad

కనిపించని దర్గా అభివృద్ధి

నిజామాబాద్ ముచ్చట్లు:
 
మూడడుగులు ముందుకు ఏడడుగులు వెనక్కి అనేలా ఉంది దర్గా దుస్థితి. వక్ఫ్ బోర్డు నుంచి నిధులు పుష్కలంగా వస్తున్నా, దర్గా ఆదాయం రూ. కోట్లలో ఉన్న అభివృద్ధి శూన్యమే. కొండ పైనున్న దర్గా చేరడానికి సరైన నడక మార్గం అంతంతే. మెట్లు ఎక్కాలంటే కాళ్ళు పగలాల్సిందే. ఎక్కడ చూసినా దుర్గందమే. ముక్కు పూటలు అదిరేలా దుర్వాసన. రోగాలు పొంచి ఉన్నంత ప్రమాద పరిస్థితులు. ఎక్కడ ప్రజా మూత్రశాలలు, మరుగుదొడ్డులు గగనమే. మంచి నీళ్ళు దొరకడం కష్టమే. తాగు నీటి ట్యాంకులు అలంకార ప్రాయమే. ఈ నీళ్లతో కాళ్ళు కడుక్కోవడమే తప్పా, తాగలేం. వీటి చుట్టూ దోమల రోత. రక్షణ గాలి మాటే. దొంగతనాలు, గొడవలు, బెదిరింపులు, దాదాగిరి నిత్యకృత్యం. సీసీ కెమెరాలు మచ్చుకైనా ఉండవు. పోలీస్ చెక్ పోస్ట్ వినతులకే పరిమితం. కరెంట్ వెలుగులు అక్కడక్కడే. చీకట్లో గడపాల్సిన వైనం. అద్దె గదుల రాబడి మీదనే కాంట్రాక్టర్ల ప్రేమ. వసతుల కల్పన మీద మాత్రం శూన్యం. అడుగడుగున దోపిడి తప్పితే, అభివృద్ధి అంతంతే.మైనార్టీ యువతకు ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు కల్పిస్తోంది. ఉద్యోగ కల్పనకు సబ్సిడీపై స్వయం ఉపాధి పథకాలు ప్రవేశ పెడుతుంది. పుణ్యక్షేత్రంగా, పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందిన బడాపహాడ్ దర్గాను, ఉపాధి కేంద్రంగా మలుచుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. స్థానిక యువతకు ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పిస్తే, భక్తులకు బాధలు తీరడంతో పాటు, నిరుద్యోగాన్ని పారదోలినట్టు అవుతుంది. ఈ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని స్థానికులు కోరుతున్నారు. బడాపహాడ్ దర్గాలో అవినీతి, అక్రమాలు, వసతులలేమిపై స్థానిక పరిపాలన అదనపు కలెక్టర్ చిత్రా మిశ్రా దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా, ఆమె కింది అధికారుల ద్వారా బడాపహాడ్ లీలలపై ఆరా తీశారు. ప్రక్షాళన చర్యలకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Invisible Dargah development