Natyam ad

ఉత్తమ యువజన సంఘము అవార్డు కు దరఖాస్తుల ఆహ్వానం

 కడప ముచ్చట్లు:


భారత ప్రభుత్వం, యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ, నెహ్రు యువ కేంద్ర , కడప  వారు 2021-2022  సంవత్సరం కు గాను  జిల్లా స్థాయి ఉత్తమ యువజన సంఘం  అవార్డు పురస్కారం కోసం దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు  నెహ్రు యువ కేంద్ర, జిల్లా యువ అధికారి  కే. మణికంఠ  ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా  జిల్లాకు సంబందించిన యువజన సంఘాలు  గ్రామీణ ప్రాంతాలలో చురుకుగా  నిర్వహించిన స్వచ్చంద సేవ కార్యక్రమాలు 2021  ఏప్రియల్ 1 తేదీ నుంచి   31 మార్చి 2022  వరకు  పనిచేసిన  కార్యక్రమాలు ప్రధానంగా  విద్య , పర్యావరణ పరిరక్షణ, మహిళా సాధికారత, వృత్తి శిక్షణ, వరకట్న, అంటరానితనం నిర్ములన, ట్రీ ప్లాంటేషన్,  హెల్త్ అండ్ ఫామిలీ,  స్పోర్ట్స్ మరియు కల్చరల్,  జాతీయ సమైక్యత, కరోనా వ్యాధి  పై అవగాహనా మరియు  కరోనా లో సంస్థ చేసిన సేవలు అను కార్యక్రమాల యొక్క ఫోటోస్ మరియు ప్రెస్ క్లిప్పింగ్ లను  నిర్ణిత దరఖాస్తుకు  జత చేసి  డిసెంబర్ నెల 8 వ తేదీ  సాయంత్రం 5 గంటల లోపు తమ కార్యాలమునులకు  పంపాలి అన్నారు. గెలుపొందినిన ఉత్తమ సంఘమునకు Rs. 25,000/- నగదు బహుమతి తోపాటు ప్రశంస పత్రము అందజేయబడును.   తదుపరి  జిల్లా స్థాయి విజేత  రాష్ట్ర స్థాయి,  దేశ స్థాయి లలో ఉత్తమ సంఘము లలో  పోటీ ఉంటుందని  దరఖాస్తులకు మరియు ఇతర వివరములు తమ కార్యాలమును నెహ్రు యువ కేంద్ర , యూత్ హాస్టల్ బిల్డింగ్,  బాలాజీ నగర్ రోడ్ నెంబర్ – 13 , కడప అను చిరునామాను   08562-356303  ,9177616677  అను నెంబర్ ను సంప్రదించాలన్నారు.

 

Tags; Invitation for applications for Best Youth Association Award

Post Midle
Post Midle