Natyam ad

పద్మ అవార్డు కోసం దరఖాస్తుల ఆహ్వానం

జగిత్యాల ముచ్చట్లు:

కేంద్ర హోం శాఖ, భారత ప్రభుత్వం వివిధ రంగాలలో కళలు, సామాజిక సేవ కార్యక్రమాలు, సైన్సు, ఇంజనీరింగ్, వృత్తి, పరిశ్రమలు, అక్షరాస్యత, విద్య, వైద్య సేవ, సివిల్ సర్వీసెస్, క్రీడలు తదితర వాటిలో సేవలందించిన అర్హులైన వారి నుండి పద్మ అవార్థుల కొరకు ధరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి భోనగిరి నరేష్ సోమవారం నాడు విడుదల చేసిన ఒక ప్రకటన లో తెలిపారు. అర్హతలు, దరఖాస్తు, ఇతర వివరాల కొరకు వెబ్ సైట్ http://www.padmaawards.gov.in ద్వారా పొందవచ్చని తెలిపారు. అర్హులైనవారు జగిత్యాల జిల్లాలోని అభ్యర్థులు అవసరమైన ద్రువపత్రాలతో 800 పదాలకు మించకుండా 19.05.2022 లోగా జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి కార్యాలయం, స్వామి వివేకానంద మినీ స్టేడియం, గొల్లపల్లి రోడ్ జగిత్యాల. సమర్పించాలని వారు సూచించారు.

 

Post Midle

Tags: Invitation for applications for the Padma Award

Post Midle