నాలాయిర దివ్య ప్రబంధ పారాయణ స్కీమ్‌లో ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
తిరుపతి ముచ్చట్లు:
టిటిడి నాలాయిర దివ్య ప్రబంధ పారాయణ స్కీమ్‌లో 2021-22 సంవత్సరానికి గాను కేటగిరి -1, 2 మరియు పరిశీలకులుగా పనిచేసేందుకు నాలాయిర దివ్యప్రబంధం చదివిన దేశవ్యాప్తంగా ఉన్న శ్రీవైష్ణవ బ్రాహ్మణుల నుండి రెండోసారి దరఖాస్తులు ఆహ్వానించడమైనది. ఎంపికైన వారు నెలవారీ సంభావన ప్రాతిపదికన శ్రీవైష్ణవ ఆలయాల్లో నాలాయిర దివ్యప్రబంధం పారాయణం చేయాల్సి ఉంటుంది. www.tirumala.org వెబ్‌సైట్ నుండి దరఖాస్తులు పొందవచ్చు.పూర్తి చేసిన దరఖాస్తులను 2022, జనవరి 25వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు “ప్రత్యేకాధికారి వారి కార్యాలయం, నాలాయిర దివ్యప్రబంధ పారాయణ స్కీమ్, ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు, తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్వేత భవనం, తిరుపతి – 517502” చిరునామాకు పంపాల్సి ఉంటుంది. మొదటి సారి దరఖాస్తు చేసిన వారు తిరిగి పంపాల్సిన అవసరం లేదు. ఇతర వివరాలకు 0877-2264519 నంబరులో కార్యాలయ వేళల్లో సంప్రదించగలరు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Invitation for applications to fill the vacancies in the Four Thousand Divine Essay Reading Scheme