ఎస్వీ సంగీత కళాశాలలో పార్ట్ టైమ్ కోర్సులలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
తిరుపతి ముచ్చట్లు:
శ్రీవేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాలలో సాయంత్రం (పార్ట్ టైమ్) కోర్సుల్లో ప్రవేశానికి అర్హులైన విద్యార్థుల నుంచి జూన్ 20వ తేదీ వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.సాయంత్రం కళాశాలలో గాత్రం, వీణ, వేణువు, మృదంగం, వయోలిన్, భరతనాట్యం, కూచిపూడి, హరికథ, ఘటం విభాగాలున్నాయి. ఇందులో సర్టిఫికెట్ కోర్సుకు 5వ తరగతి ఉత్తీర్ణులై ,10 సంవత్సరాలు వయసు(జూన్ 30వ తేదీకి) కలిగి ఉండాలి. రూ.2000/- ఫీజు చెల్లించాలి. డిప్లమో కోర్సుకు సర్టిఫికెట్ కోర్సు ఉత్తీర్ణులై, 14 సంవత్సరాల వయసు, రూ.2,200/- ఫీజుగా నిర్ణయించారు. కళా ప్రవేశిక కోర్సుకు 8 సంవత్సరాల వయసు కలిగి, రూ.1500/- ఫీజు చెల్లించాలి.ఆసక్తి గల అభ్యర్థులు కళాశాల కార్యాలయ పనివేళల్లో రూ.50/- చెల్లించి దరఖాస్తు పొందవచ్చు . జూన్ 14 వతేదీ నుండి 20వ తేదీ వరకు ఇంటర్వ్యూలు అడ్మిషన్లు నిర్వహించనున్నారు. జూన్ 21వ తేదీ నుండి తరగతులు ప్రారంభిస్తారు.ఇతర వివరాలకు కళాశాల కార్యాలయ పనివేళల్లో 0877-2264597, 9848374408, 9440793205 నంబర్ల లో సంప్రదించగలరు.
Tags: Invitation of applications for admission to part-time courses in SV Sangeet College

