ఎస్వీ బాల‌మందిరంలో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

తిరుపతి ముచ్చట్లు:

2022-23 విద్యా సంవత్సరానికి గాను శ్రీ వేంకటేశ్వర బాలమందిరంలో అనాథ బాలబాలికలను చేర్చుకునేందుకు దరఖాస్తులు ఆహ్వానించడమైనది. దరఖాస్తుదారులు ఆంధ్ర ప్ర‌దేశ్‌కు చెందిన హిందువు అయి ఉండాలి. వయసు 5 నుండి 10 సంవత్సరాలలోపు ఉండాలి.దరఖాస్తుదారులు తమకు సంబంధించిన వివరాలను తెల్ల కాగితంపై రాసి, విద్యార్థి జనన తేదీ ధ్రువీకరణ పత్రం, స్ట‌డీస‌ర్టిఫికేట్‌, తల్లిదండ్రుల మరణ ధ్రువీకరణ పత్రాలు, సంరక్షకుల ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం, నివాస ధ్రువీకరణ పత్రం, ఆరోగ్య నిర్ధార‌ణ ధ్రువీకరణ పత్రం, విద్యార్థులు చేరిన‌ప్ఫుడు వారి సంర‌క్ష‌కుల అఫిడ‌విట్‌, విద్యార్థుల‌పై ఎటువంటి పోలీస్ కేసు లేద‌ని నిర్ధార‌ణ ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, రేష‌న్ కార్డు, విద్యార్థి మ‌రియు గార్డియ‌న్ల ఫోటోలు, సెల్ నెం తదితర జిరాక్సు కాపీలను జత చేయాలి.దరఖాస్తులను ఆగ‌స్టు 16వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా ”సహాయ కార్యనిర్వహణాధికారి, శ్రీ వేంకటేశ్వర బాలమందిరం, తి.తి.దేవస్థానములు, భవానీనగర్‌, తిరుపతి” అనే చిరునామాకు స్వయంగా కానీ లేదా పోస్టు ద్వారా కానీ అందజేయవచ్చు. ఇతర వివరాలకు 0877-2264613 ఫోన్‌ నంబరులో సంప్రదించగలరు.

 

Tags: Invitation of applications for admissions in SV Balamandiram

Leave A Reply

Your email address will not be published.