ఎస్వీ సంప్రదాయ ఆలయ శిల్ప కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
తిరుపతి ముచ్చట్లు:
శ్రీ వేంకటేశ్వర సంప్రదాయ ఆలయ శిల్ప కళాశాలలో 2022-23 విద్యాసంవత్సరానికి గాను డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సు (సంప్రదాయ కళంకారి కళ)లో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడమైనది. కళాశాలలో జూలై 11 నుండి 30వ తేదీ వరకు దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 30వ తేదీ సాయంత్రంలోపు కళాశాలలో సమర్పించాల్సి ఉంటుంది.డిప్లొమా కోర్సులో ప్రవేశం పొందిన వారికి లక్ష రూపాయల చొప్పున బ్యాంకులో డిపాజిట్ చేసి ఉత్తీర్ణత సాధించిన అనంతరం నిబంధనలకు లోబడి చెల్లిస్తారు. కోర్సులు, విద్యార్హతలు, ఇతర వివరాల కోసం www.tirumala.org వెబ్సైట్ను గానీ, కళాశాల కార్యాలయాన్ని 0877-2264637 నంబరులో పనివేళల్లో సంప్రదించగలరు.
Tags:Invitation of applications for admissions in SV Traditional Temple Architecture College