Natyam ad

ఎస్వీ వేదాంతవర్ధిని సంస్కృత కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

తిరుపతి ముచ్చట్లు:

టిటిడికి చెందిన సికింద్రాబాద్ లోని ఎస్వీ వేదాంతవర్ధిని సంస్కృత కళాశాలలో 2022-23 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలకు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించడమైనది.పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు రెండేళ్ల ప్రి డిగ్రీ కోర్సులో చేరేందుకు అర్హులు. సంస్కృతం ద్వితీయ భాషగా ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు బిఏ(ఓఎల్) డిగ్రీ కోర్సులో చేరేందుకు అర్హులు. విద్యార్థులకు ఉచితంగా బస, భోజన సౌకర్యం కల్పించడం జరుగుతుంది. ఈ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు అన్ని పోటీ పరీక్షలు రాసేందుకు అర్హులు. జూలై 5వ తేదీ నుంచి ఆగస్టు 30వ తేదీ లోపు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరడమైనది.విద్యార్థులు తమ దరఖాస్తులను పంపించాల్సిన చిరునామా: శ్రీ వెంకటేశ్వర వేదాంతవర్ధిని సంస్కృత కళాశాల, 170- ఓల్డ్ ఎయిర్ పోర్ట్ రోడ్డు, బోయిన్ పల్లి, సికింద్రాబాద్-500011.మరిన్ని వివరాల కోసం 040 – 27750032, 9248813578, 990897 0007, 9441645995 నంబర్లను సంప్రదించగలరు.

 

Post Midle

Tags: Invitation of applications for admissions in SV Vedantavardini Sanskrit College

Post Midle