సీఎం జగన్ కు విశాఖ శారదాపీఠం ఆహ్వానం

విశాఖ ముచ్చట్లు:
 
విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి మంగళవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి విశాఖ శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేసారు. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు విశాఖ శారదాపీఠం వార్షికోత్సవాలు జరగనున్నాయని ముఖ్యమంత్రికి తెలిపారు. వార్షిక మహోత్సవాల్లో పాల్గొని శ్రీ శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారి అనుగ్రహం, పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి ఆశీస్సులు పొందాలని ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి వెంట ముఖ్యమంత్రిని కలిసిన వారిలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా ఉన్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Invitation of Visakha Saradapith to CM Jagan

Natyam ad