బిజెపి పార్టీలోకి వచ్చే వారందరికీ ఆహ్వానం
-ఈ నెల 21న అమిత్‌షా సమక్షంలో బీజేపీలో చేరనున్న రాజగోపాలరెడ్డి
– బీజేపీ చేరికల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్
హైదరాబాద్ ముచ్చట్లు:
ప్రస్తుతం అందరి చూపు బీజేపీ వైపే ఉందని బీజేపీ చేరికల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. కాంగ్రెస్ ను వీడిన కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఈ నెల 21న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సమక్షంలో బీజేపీలో చేరనున్నారని ఆయన తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్, నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్, ఎర్రబెల్లి ప్రదీప్‌రావు వంటి నాయకులూ కాషాయకండువా కప్పుకోనున్నట్లు చెప్పా రు.బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ, పార్టీలోకి వచ్చే వారందరికీ ఆహ్వానం పలుకుతున్నట్లు తెలిపారు. 21వ తేదీ నాటికి పలువురు రిటైర్డ్ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, వ్యాపారులతో పాటు ఇతర పార్టీల నాయకులు 10 నుంచి 15 మంది తమ పార్టీలో చేరనున్నారని వెల్లడించారు.

Tags: Invitation to all who join BJP party
