లయన్స్ ఉత్సవాలకు డిప్యూటీ సీఎంకు ఆహ్వానం

కడప ముచ్చట్లు:

ఈ నెల 28వ తేదిన ప్రొద్దుటూరులో రాయలసీమ స్థాయిలో జరుగుతున్న లయన్స్ క్లబ్ 318 జే విభాగం ఉత్సవాలకు హాజరు కావాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్ బీ అంజద్ బాషను లయన్స్ క్లబ్ ప్రతినిధులు ఆహ్వానించారు. ప్రొద్దుటూరు విభాగ ప్రతినిధి 316జే గవర్నర్ రామచంద్రప్రకాశ్, లయన్స్ క్లబ్ ఆఫ్ కడప అన్నమయ్య ఫాస్ట్ గవర్నర్ లయన్ కె.మానస చిన్నపరెడ్డి, ప్రొద్దుటూరు లయన్ క్యాబినెట్ కార్యదర్శి సత్యం, కడప లయన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి గౌరీశంకర్లు బుధవారం కడప నగరంలోని డిప్యూటీ సీఎం కార్యాలయంలో ఆయనను కలిసి ఈ మేరకు ఆహ్వానపత్రాన్ని అందజేశారు.  తాము నిర్వహిస్తున్న కార్యక్రమాల వివరాలను ఆయనకు తెలియజేశారు. ప్రస్తుతం జరగనున్న సమావేశంలో రాయలసీమ స్థాయిలో లయన్స్ ప్రతినిధులందరూ పాల్గొంటారని, నిర్వహించాల్సిన సామాజిక సేవా కార్యక్రమాల గురించి నిర్ణయాత్మక చర్చలు జరగనున్నాయని వారు డిప్యూటీ సీఎంకు వివరించారు. ఇదే సందర్భంగా నూతన సభ్యులను కూడా చేర్చుకోనున్నట్లు తెలిపారు. డిప్యూటీ సీఎం స్పందిస్తూ లయన్స్ సేవలు ప్రశంసనీయమని, తాను తప్పక ఈ కార్యక్రమానికి హాజరవుతానని తెలిపారు. కార్యక్రమంలో లయన్స్ దేవతి రవి, కొండూరు జనార్దన్ రాజు తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Invitation to Deputy CM for Lions festival

Leave A Reply

Your email address will not be published.