Natyam ad

విశ్వకర్మ వ్రత మహోత్సవానికి పుట్ట దంపతులకు ఆహ్వానం    

-ఆహ్వానపత్రిక అందజేసిన రామగుండం విశ్వబ్రాహ్మణ పురోహితులు

మంథని ముచ్చట్లు:

రామగుండం నియోజక వర్గ విశ్వబ్రాహ్మణ పురోహిత సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 21న వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం గోదావరిఖనిలో నిర్వహించే విరాట్ విశ్వకర్మ వైభవోత్సవములు, సామూహిక శ్రీ విరాట్ విశ్వకర్మ వ్రత మహోత్సవ  కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, మంథని మున్సిపల్ ఛైర్పర్సన్  పుట్ట శైలజ లను విశ్వబ్రాహ్మణ పురోహితులు సోమవారం ఆహ్వానించారు. మంథని పట్టణంలోని జెడ్పీ చైర్మన్ క్యాంప్ కార్యాలయంలో మంథని మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజకు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు ముత్తోజు వీర బ్రహ్మచార్యులు మాట్లాడుతూ ఈనెల 19 నుండి 21 వరకు విశ్వకర్మ వైభవోత్సవాలను నిర్వహిస్తున్నామని, 19, 20 తేదీలలో లక్ష కుంకుమార్చన, లక్ష బిల్వార్చన, లక్ష పుష్పార్చన కార్యక్రమాలు, 21న సామూహిక విశ్వకర్మ వ్రతాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ గర్రెపల్లి సత్యనారాయణ, మియాపురం వీరభద్రయ్య, మమునూరి రాజు లతోపాటు  విశ్వబ్రాహ్మణ పురోహితులు, సంఘ నాయకులు నాయకులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Invitation to Putta couples for Vishwakarma Vrata Mahotsava

Post Midle

Leave A Reply

Your email address will not be published.